schedule Thursday, September 03, 2026

100 నియోజ‌క‌వ‌ర్గాల్లో ద‌ళితబంధు..!

calendar_today October 5, 2021
person dharshininews
100 నియోజ‌క‌వ‌ర్గాల్లో ద‌ళితబంధు..!
100 నియోజ‌క‌వ‌ర్గాల్లో ద‌ళితబంధు..! - సీఎం కేసీఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న - వ‌చ్చే యేడాది మార్చిలోగా అమ‌లు - ఒక్కో నియ‌జ‌కవ‌ర్గానికి ఒక్కొక్క‌రిని చొప్పున ఎంపిక ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ రాష్ట్రంలో వ‌చ్చే యేడాది మార్చిలోపు 100 నియోజకవర్గాల్లో దళితబంధు అమలు చేస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ పథకానికి దాదాపు రూ.3 వేల కోట్లు ఖర్చు చేస్తామని.. వచ్చే బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లు ఖర్చు కేటాయిస్తామని వెల్లడించారు. ప్రయోగాత్మకంగా ఒక్కో నియోజకవర్గానికి 100 మందికి ఇవ్వాలని అనుకున్నామని.. దళితబంధు పథకం ఇంకా ప్రారంభంలోనే ఉందని చెప్పారు. అమలులో తలెత్తే సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకెళ్తామన్నారు. రాష్ట్రంలో నాలుగు మూలల, విభిన్నమైన 4 మండలాలను ఎంపిక చేశాంమని వెల్లడించారు. త్వరలో ఈ మండలాల్లో దళిత బంధు అమలు చేస్తామన్నారు. నియోజకవర్గానికి 100 మందిని ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేదేనని సీఎం కేసీఆర్​ తెలిపారు. దళితబంధు హుజూరాబాద్‌ కోసం తీసుకొచ్చింది కాదని సీఎం స్పష్టం చేశారు. 1986లోనే దళితబంధు పురుడుపోసుకుందన్నారు. గతంలో సిద్దిపేటలో దళిత చైతన్యజ్యోతి కార్యక్రమం చేశామని గుర్తు చేశారు. నిధులతో పలానా పని చేయాలని ప్రభుత్వం బలవంతం పెట్టదని సీఎం స్పష్టం చేశారు. భవిష్యత్‌లోనూ తెరాస ప్రభుత్వమే ఉంటుందని చెప్పారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక దళితబంధు చేపట్టాలని గతంలోనే అనుకున్నట్లు చెప్పారు. దళితబంధు పథకం గతేడాది ప్రారంభం కావాల్సి ఉందని.. కరోనా వల్ల దళితబంధు పథకం ఏడాది ఆలస్యంగా ప్రారంభమైందన్నారు. కరోనా వల్ల రూ.లక్ష కోట్లు నష్టం జరిగిందని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో వివరించారు. పరిస్థితుల మేరకు బడ్జెట్‌ అంచనాలు సవరించి నిధులు కేటాయించడం ఆనవాయితీ అని తెలిపారు. క్రమంగా 119 నియోజకవర్గాల్లో దళిత బంధు అమలు చేయాలనే ఆలోచన తమకు ఉందని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు..