schedule Thursday, September 03, 2026

వీధి వ్యాపారులకు గుడ్‌ న్యూస్..!

calendar_today November 26, 2025
person dharshininews
వీధి వ్యాపారులకు గుడ్‌ న్యూస్..!
వీధి వ్యాపారులకు గుడ్‌ న్యూస్..! - వ్యాపారాలకు పెట్టుబడి సాయం పెంపు - కొత్త నిబంధనలు తెచ్చిన కేంద్రం హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : వీధి వ్యాపారలకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్ చెప్పింది. వ్యాపారాలకు అందిస్తున్న పెట్టుబడి సాయం పెంచి.. వారి వ్యాపార అభివృద్ధికి తోడ్పాటు అందిస్తోంది. ఐదేళ్ల కింద కేంద్ర ప్రభత్వం ప్రధాన మంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి(పీఎం స్వనిధి) పథకాన్ని ప్రవేశ పెట్టింది. పురపాలికలు, నగరపాలికల పరిధిలో వీధి వ్యాపారాలు చేసుకునే వారిపై ప్రత్యేక సర్వే చేసి గుర్తింపు కార్డులను అందించారు. వారికి వివిధ బ్యాంకుల ద్వారా తొలి విడతగా రూ.10వేలు, ఇవి చెల్లించిన వారికి రెండో దశలో రూ.20వేలు, వీటిని తిరిగి చెల్లించిన వారికి రూ.50వేలు రుణం అందజేశారు. గత డిసెంబరు నుంచి ఈ ప్రక్రియ నిలిచిపోయింది. కొన్ని మార్పులతో ఈ పథకం తిరిగి అమల్లోకి వచ్చింది. సాయం పెంపు అందులో భాగంగా తొలి విడతగా రూ.15వేలు (15మాసాల్లో తిరిగి చెల్లించాలి). అప్పుడు రెండో దశలో రూ.25వేలు (18 మాసాల్లో చెల్లించాలి), తుది విడతగా రూ.50వేలు(36 మాసాల గడువు) రుణంగా అందజేయనున్నారు. మూడు విడతలు పొందిన వారికి మరోసారి ఈ పథకం ద్వారా రుణం తీసుకునే అవకాశం ఉండదు. ఆర్థిక క్రమశిక్షణ పాటించిన వారికి బ్యాంకులు రూపే క్రెడిట్‌ కార్డును ఇస్తాయి. దీని ద్వారా రూ.30వేలు తీసుకుని తిరిగి చెల్లించాలి. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39806/