schedule Thursday, September 03, 2026

తాండూరులో రైల్వే గూడ్స్‌ వై క్యాబిన్ ప్రారంభం

calendar_today March 17, 2026
person dharshininews
తాండూరులో రైల్వే గూడ్స్‌ వై క్యాబిన్ ప్రారంభం
తాండూరులో రైల్వే గూడ్స్‌ వై క్యాబిన్ ప్రారంభం - స్టేషన్, సిగ్నలింగ్‌ను స్ట్రార్ట్‌ చేసిన ఏడీఆర్ఎం - సిమెంట్ పరిశ్రమలకు సులభంగా సరుకు రవాణా తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు రైల్వే స్టేషన్ పరిధిలో కొత్తగా గూడ్స్ వై క్యాబిన్ ప్రారంభమయ్యింది. తాండూరు రైల్వే స్టేషన్ పరిధి నారాయణపూర్ సమీపంలో దాదాపు రూ. 80కోట్లతో వై క్యాబిన్, అధునాతున సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. మంగళవారం సికింద్రబాద్‌ ఏడీఆర్ఎం సంజీవరావు ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారి మురళీ, లక్ష్మీనర్సింహా శాస్త్రీ, డీఎస్టీఈ సాయి కిరణ్‌, డీఓఎం మిథున్‌ రాజాలు పాల్గొన్నారు. ఈ వై జంక్షన్ ఏర్పాటు ద్వారా సిమెంట్ పరిశ్రమలకు వచ్చే గూడ్స్ రైళ్లను తాండూరుకు రాకుండా నేరుగా సిమెంట్ కర్మాగారాలకు ప్రయాణించే విధంగా వెసులుబాటును కల్పించారు. ఈ విధానంలో గూడ్స్ రవాణా పురోగతి చెందుతుందని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. https://www.dharshininews.com/42608/