schedule Thursday, September 03, 2026

రైల్లో ఆ పనిచేస్తే జైలే..!

calendar_today June 29, 2026
person dharshininews
రైల్లో ఆ పనిచేస్తే జైలే..!
రైల్లో ఆ పనిచేస్తే జైలే..! - జులై1 నుంచి కొత్త రూల్‌ - గెటిట్ జారీ చేసిన కేంద్రం హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా రైళ్లలో ఈ కొత్త నియమాలు అమల్లోకి రానున్నాయి. ఇక నుంచి ఎవరైనా రూల్‌ అతిక్రమిస్తే జైలు శిక్ష తప్పదని కేంద్రం హెచ్చరించింది. రైళ్లలో ప్రయాణికుల భద్రత, క్రమశిక్షణను మెరుగుపరిచేందుకు కేంద్రం ‘జన్ విశ్వాస్ చట్టం’ కింద నిబంధనలను మరింత కఠినతరం చేసింది. దీనికి సంబంధించిన అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. రైళ్లలో గానీ, రైల్వే స్టేషన్ ప్రాంగణంలో గానీ ధూమపానం చేస్తూ పట్టుబడితే భారీ జరిమానా విధిస్తారు. అంతేకాదు, తప్పు తీవ్రతను బట్టి సదరు ప్రయాణికుడి టికెట్‌ను తక్షణమే రద్దు చేయడంతో పాటు, జైలు శిక్ష విధించే అవకాశం కూడా ఉందని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలిగించే ఇలాంటి చర్యలపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదని అధికారులు తేల్చిచెప్పారు. ఈ చట్టం ద్వారా కేవలం ధూమపానమే కాకుండా, రైళ్లలో జరిగే మరో పెద్ద సమస్యకు చెక్ పడనుంది. రిజర్వేషన్ లేని ప్రయాణికులు ఇతరుల బెర్తులను ఆక్రమించుకోవడం, తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడం వంటి పనులకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కొత్త నిబంధనలు మార్గం సుగమం చేశాయి. జూలై 1 నుంచి ఈ రూల్స్ ను పకడ్బందీగా అమలు చేయనుంది. https://www.dharshininews.com/43633/