schedule Thursday, September 03, 2026

తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి కొత్త సూపరిండెంట్

calendar_today August 13, 2026
person dharshininews
తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి కొత్త సూపరిండెంట్
తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి కొత్త సూపరిండెంట్ - బాధ్యతలు స్వీకరించిన డా. రజా మాలిక్ ఖాన్ తాండూరు, దర్శిని ప్రతినిధి : రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని తాండూరు గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి(జీజీహెచ్) సూపరిండెంట్ డా. రజా మాలిక్‌ ఖాన్ అన్నారు. తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి డిఎంఈ పరిధిలోకి వెళ్లడంతో ఆసుపత్రికి సూపరిండెంట్‌గా ఆయనను నియమించింది. ఈ మేరకు గురువారం ఆసుపత్రిలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసుపత్రిలో రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దృష్టిసారిస్తామని అన్నారు. ఆసుపత్రి ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. అందరి సహాకారంతో ఆసుపత్రి పనితీరును మెరుగు పరుస్తామని అన్నారు. ఆసుపత్రి వైద్య సేవల్లో ఎలాంటి అపోహలను పెట్టుకోవద్దని సూచించారు. నాణ్యమైన వసతులు, సౌకర్యాలు కల్పించి.. వైద్య సేవలలో ఆదర్శంగా నిలుపుతామని స్పష్టం చేశారు. మరోవైపు ఆసుపత్రిలో సూపరిండెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన డా. రజా మాలిక్‌ ఖాన్‌కు ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. https://www.dharshininews.com/44180/