schedule Thursday, September 03, 2026

పైలెట్ రాకకు ముహర్తం ఖరారు

calendar_today August 14, 2026
person dharshininews
పైలెట్ రాకకు ముహర్తం ఖరారు
పైలెట్ రాకకు ముహర్తం ఖరారు - 17న తాండూరుకు రోహిత్ రెడ్డి - బీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న సందడి తాండూరు, దర్శిని ప్రతినధి : ఈనెల 17న తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తాండూరుకు రాబోతున్నారని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. డ్రగ్స్‌ కేసు వివాదం నేపథ్యంలో గత మార్చి నుంచి రోహిత్ రెడ్డి తాండూరు దూరంగా ఉంటున్నారు. కోర్టులో వివాదాలకు ఇటీవలే ఊరట లభించింది. కొన్ని రోజులుగా రోహిత్ రెడ్డి తాండూరుకు వస్తున్నారని ప్రచారం బలంగా జరిగింది. చివరకు రోహిత్ రెడ్డి తాండూరులో అడుగు పెట్టేందుకు ముహుర్తం ఖరారయ్యింది. ఈనెల 17న సుదీర్ఘ విరామం తరువాత ఆయన తాండూరుకు రాబోతున్నారు. ఎట్టకేలకు పైలెట్ రోహిత్ రెడ్డి రాకకోసం ఎదురుచూస్తు నేతలు, జనం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 17న తాండూరు పట్టణంలోని ఆయన నివాసంలో రోహిత్ రెడ్డి నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు, ప్రజలతో ఆత్మీయంగా కలవబోతున్నారు. తాండూరుకు రోహిత్ రెడ్డి రాబోతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో రాజకీయ సందడి మొదలైంది. https://www.dharshininews.com/44206/