schedule Thursday, September 03, 2026

పిల్లలు తినే ఆహారాల్ని వదలని కల్తీగాళ్లు..!

calendar_today August 20, 2026
person dharshininews
పిల్లలు తినే ఆహారాల్ని వదలని కల్తీగాళ్లు..!
పిల్లలు తినే ఆహారాల్ని వదలని కల్తీగాళ్లు..! - పాడైన చక్కెరతో తినుబండారాల తయారి - గుట్టు రట్టు చేసిన ఫుడ్‌ సెఫ్టీ, పోలీసు అధికారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : పిల్లలు తినే తినుబండారాలను కల్తీ చేస్తున్న వ్యాపారి గుట్టు రట్టు అయ్యింది. గురువారం తాండూరులో ఫుడ్‌ సెఫ్టీ, పట్టణ పోలీసుల బృందం పట్టణంలోని గంజ్‌ ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుందరమూర్తి సుందర్ అనే వ్యక్తి తినుబండారాలు తయారుచేసి హోల్ సెల్గా విక్రయిస్తూ వ్యాపారం చేస్తున్నాడు. అక్కడ సింథటిక్ కెమికల్స్, పాడై పోయిన చక్కెరతో పాటు కాలం చెల్లిన చిన్నపిల్లలు తినే పలు రకాల తినుబండారాలు గుర్తించారు. వీటిన్నంటిని సీజ్ చేసి పట్టణ పోలీసులకు అప్పగించారు. ఈమేరకు సదరు వ్యక్తిని అరెస్టు చేసి, కేసు నమోదు చేసినట్లు ఎస్సై నూమన్‌ అలీ తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ కల్తీ ఆహారాలపై ప్రత్యేక నిఘా ఉంచడం జరుగుతుందని, ఎలాంటి సమాచారం తెలిసినా పోలీసులకు తెలియజేయాలని సూచించారు. https://www.dharshininews.com/44296/