ముదురుతున్న వివాదం..!
August 25, 2026
dharshininews
ముదురుతున్న వివాదం..!
- అధ్యాపకుడిపై చర్యలు తీసుకోవాలి
- ప్రజా సంఘాల డిమాండ్
- కొందరు విలేకరులు మధ్యవర్తులుగా వ్యవహరించారని ఆరోపణలు
- విద్యార్థి సంఘాల సీరియస్
తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థినిని లోబర్చుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ అధ్యాపకుడి వ్యవహారం ముదురుతున్నట్లు కనిపిస్తోంది. గతంలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై తాజాగా వివిధ ప్రజా సంఘాలు స్పందిస్తూ.. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధ్యాపకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
విద్యార్థినితో సంబంధం ఉన్న ఈ వ్యవహారంలో కొందరు విలేకరులు మధ్యవర్తులుగా వ్యవహరించారనే ఆరోపణలు కూడా తాజాగా వినిపిస్తున్నాయి. అసలు ఘటనపై సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ప్రజా సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఘటనపై విద్యార్థి సంఘాలు కూడా తీవ్రంగా స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. అధ్యాపకుడిపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనలకు దిగేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
ఈ నేపథ్యంలో విద్యాశాఖ, పోలీసు అధికారులు స్పందించి.. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, ఆరోపణలు నిజమని తేలితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి. దీంతో ఈ వ్యవహారం రానున్న రోజుల్లో మరింత ముదిరే అవకాశముంది.
https://www.dharshininews.com/44352/