schedule Thursday, September 03, 2026

వ్యక్తి అదృశ్యంలో విషాధం..!

calendar_today August 25, 2026
person dharshininews
వ్యక్తి అదృశ్యంలో విషాధం..!
వ్యక్తి అదృశ్యంలో విషాధం..! - మృతదేహంగా లభ్యమైన వ్యక్తి - పల్లె చెరువులో డెడ్‌ బాడీ గుర్తింపు - శోకసముద్రంతో కుటుంభీకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : అదృశ్యమైన వ్యక్తి ఘటన తీవ్ర విషాధంగా ముగిసింది. ఎలాగైనా తిరిగివస్తాడు అనుకున్న వ్యక్తి మృతదేహంగా లభ్యమయ్యాడు. ఈ సంఘటన తాండూరు మండలం అంతారంలో విషాధాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే.. అంతారం గ్రామానికి చెందిన నరసింహారెడ్డి అనే వ్యక్తి అదృశ్యమయ్యారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి ఆయన కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలిసిన వారి వద్ద, బందువుల వద్ద విచారించినా ఫలితం లేకపోవడంతో సోమవారం తాండూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే నర్సింహా రెడ్డి అక్క అతని కోసం తీవ్రగా గాలించడంతో భూకైలాస్‌కు వెళ్లే మార్గంలో వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. దీంతో మంగళవారం ఉదయం ఈ ప్రాంతంలో గాలిస్తుండగా మల్‌రెల్లి పరిధిలోని పల్లె చెరువులో నర్సింహారెడ్డి మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రి మార్చురికి తరలించారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. గ్రామంలో చిన్న కిరాణ కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తోంది. నర్సింహారెడ్డి మృతితో కుటుంబం శోకసముద్రంలో మునిగిపాయారు. https://www.dharshininews.com/44354/