schedule Thursday, September 03, 2026

వసతిగృహం నుంచి విద్యార్థి పరార్

calendar_today August 27, 2026
person dharshininews
వసతిగృహం నుంచి విద్యార్థి పరార్
వసతిగృహం నుంచి విద్యార్థి పరార్ - పెద్దేముల్ వసతి గృహంలో ఘటన - చపాతి సంగతి మరవకముందే మరో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం విజయనగర్‌ కాలనీలోని పెద్దేముల్ మండల వసతిగృహంలో విద్యార్థి పారిపోయిన సంఘటన గురువారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. వసతిగృహం పీడి, విద్యార్థి తండ్రితో కలిసి తాండూరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ పరమేశ్వర్ గౌడ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మోమిన్‌పేట్ మండలం కాస్లాబాద్‌ గ్రామానికి చెందిన సాంద్ర భాస్కర్ కుమారుడు అక్షిత్(14) తాండూరు పట్టణం విజయ్ నగర్‌ కాలనీలోని పెద్దేముల్ మండలంకు చెందిన వసతిగృహంలో పదో తరగతి చదువుతున్నాడు. అయితే గురువారం ఉదయం 7 గంటల తరువాత బ్రేక్‌ ఫాస్ట్ సమయం కనిపించకుండా పోయాడు. పీడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విద్యార్థి ఆచూకీ కోసం ప్రయత్నించారు. సాయంత్రమైనా ఆచూకీ లభించకపోవడంతో తాండూరు పట్టణ పోలీసులకు ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ పరమేశ్వర్ గౌడ్ తెలిపారు. ఇదిలా ఉండగా గత కొన్ని రోజుల క్రితమే వసతిగృహంలో చపాతి విషయంలో వివాదం రేగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరవక ముందే విద్యార్థి అదృశ్యంతో వసతిగృహం మరోసారి వార్తల్లో నిలిచింది. https://www.dharshininews.com/44404/