schedule Thursday, September 03, 2026

మహిళపై దాడి కేసులో చిక్కిన నిందితుడు..!

calendar_today August 31, 2026
person dharshininews
మహిళపై దాడి కేసులో చిక్కిన నిందితుడు..!
మహిళపై దాడి కేసులో చిక్కిన నిందితుడు..! - చోరి చేసి బంగారు ఆభరణాలు స్వాధీనం - పరారిలో ప్రధాన నిందితుడు, స్నేహితుడి రిమాండ్‌ - వివరాలు వెల్లడించిన పట్టణ సీఐ పరమేశ్వర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఒంటరిగా ఉన్న మహిళపై దాడి చేసి.. బంగారం చోరి చేసిన ఘటనలో ఓ నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు పరారిలో ఉండగా.. అతని స్నేహితుని వద్ద నుంచి బంగారం ఆబరణాలను రికవరి చేశారు. సోమవారం పట్టణ సీఐ పరమేశ్వర్ గౌడ్ కేసు వివరాలను వెల్లడించారు. రెండు రోజుల క్రితం తాండూరు పట్టణం వాల్మీకీనగర్‌ సమీపంలోని బసవేశ్వర నగర్‌లో ఉమా దేవి అనే మహిళపై ఆ ఇంటి పనిమనిషి భర్త మొగలప్ప గొంతు నుమిలి బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు మొగులప్పతో పాటు అతని స్నేహితుడు సంజీవ్‌ సహకారం అందించినట్లు గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చోరీ జరిగిన రోజు మొగులప్ప, సంజీవ్‌లు ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే ఉమాదేవి పై దాడి చేసి, ఆమె మెడలో ఉన్న బంగారు ఆభరణాలు, నల్లపూసల దండను బలవంతంగా తీసుకుని అక్కడి నుంచి పరారైనట్లు విచారణలో తేలింది. సోమవారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో శివాజీ చౌక్‌ వద్ద సంజీవ్‌ను పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద ఉన్న చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పరమేశ్వర్ గౌడ్ వెల్లడించారు. అనంతరం సంజీవ్‌ను అరెస్ట్‌ చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా.. కోర్టు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించినట్లు వివరించారు. అదేవిధంగా ఈ కేసులో మరో నిందితుడైన మొగులప్ప ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలిపారు. అతని కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఐ నూమన్ అలీ, కానిస్టేబుళ్లు ఉన్నారు. https://www.dharshininews.com/44465/