ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి
August 29, 2021
dharshininews
ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి
వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ
దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. కావున జిల్లాప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ నారాయణ సూచించారు. ఆదివారం సాయంత్రం నుంచి భారీ వర్షాలు పడడంతో వికారాబాద్ జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ నేరుగా ప్రజలకు సూచనలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో వాగు దాటే ప్రయత్నం చేయొద్దన్నారు. పాడుబడ్డ ఇళ్లల్లో ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. ఎక్కడ ఏమైనా ఇబ్బంది, ఆపద వచ్చినా డయల్ 100 కి ఫోన్ చేయాలని సూచించారు. మరోవైపు గ్రామాల్లో ఉన్న యువత మీ అనుసంధానం లో ఉన్న వాగుల పై నిఘా పెట్టాలన్నారు. ఏదైనా ప్రమాదవశాత్తు వాగు ప్రవహిస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.