schedule Thursday, September 03, 2026

బుయ్యని భూకబ్జాల చిట్టా చెబుతాం..!

calendar_today September 3, 2026
person dharshininews
బుయ్యని భూకబ్జాల చిట్టా చెబుతాం..!
బుయ్యని భూకబ్జాల చిట్టా చెబుతాం..! - ఎమ్మెల్యే పదవి రాజీనామాకు సిద్దమా - తమ్ముడిని అడ్డం పెట్టుకుని కార్యకలాపాలు - అధారాలతో సహ బహిరంగ చర్చకు రెడీ - కాంగ్రెస్‌లో పదవులను అమ్ముకునే సంస్కృతి - మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి చేసిన భూ కబ్జాలను చెప్పేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్దంగా ఉందని, కబ్జాలను నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి సిద్దమా అని తాండూరు బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రశ్నించారు. గజం భూమి కబ్జా చేసినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి సిద్దమని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్పందించారు. గురువారం మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నివాసంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్‌తో పాటు పార్టీ నేతలు మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఆరోపించలేదని, సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి గురించి ఎకరాలకు భూములు కొని బకరాలకు అమ్ముతున్నారని చేసిన విమర్శలను గుర్తుచేశారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఫ్యూచర్ సిటీలో, ఇబ్రహీంపట్నం, వికారాబాద్‌ జిల్లా మర్పల్లిలో చేసిన భూ వివాదాలు అందరికి తెలిసిందే అని అన్నారు. జేబీ ఇన్ఫా, ఆయన కుమారుడిపై వివాదాలు ఉన్నాయా లేదా... సీబీఐ కేసులు ఉన్నాయా లేదా అని వాళ్లే చెప్పాలని అన్నారు. భూముల దందాపై ఎమ్మెల్యే సాగిస్తున్న అవినీతిని ఆధారాలతో కళ్లకు కట్టికట్లు చూపించేందుకు సిద్దమని అన్నారు. తాండూరులో తన తమ్ముడును అడ్డం పెట్టుకుని ప్రభుత్వ భూములను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. గుళ్లు, బడులకు సంబంధించిన భూముల వ్యవహరాల్లో కూడా వాళ్ల పేర్లు వినిపిస్తున్నాయని అన్నారు. కాగ్నానదిలో నీటిని, ఇసుకను కోడంగల్‌ ప్రాంతానికి తరలిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో పదవులను అమ్ముకునే సంస్కృతిని తెచ్చారని విమర్శించారు. చైర్మన్ పదవులు, కోఆప్షన్ పదవులు లక్షలకు అమ్ముకున్నారని, కాంగ్రెస్ పార్టీని దుకాణంగా మార్చారని ఎద్దేవా చేశారు. డబ్బు మధం, పిచ్చెక్కి ఇవన్నీ చేస్తున్నారని, ఎమ్మెల్యేకు అధికారులు, ప్రజలంటే భయం లేకుండా పోయిందని అన్నారు. 22ఏ జీవో పేరుతో ఇబ్బందులకు గురిచేసే పరిస్థితులను తీసుకవస్తున్నారని అన్నారు. గతంలో 10ఏండ్లు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మనోహర్ రెడ్డి డీసీసీబీ బ్యాంకులో 2వేల కోట్లు అప్పులు ఇచ్చారని అన్నారు. రైసు మిల్‌ల ద్వారా కొనుగోలు కేంద్రాల ధాన్యంలో అవినీతిలో వాటా దారుగా ఉన్నారని ఆరోపించారు. తాండూరు ప్రజలను మభ్య పెడుతున్న ఎమ్మెల్యే భూ కబ్జాలను నిరూపించేందుకు సిద్దంగా ఉన్నామని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు కట్టుబడి ఉంటారా అని సవాల్ చేశారు. తేది, టైం, ప్లేస్ నిర్ణయించి చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పట్లోళ్ల నర్సింలు, వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్, మాజీ వైస్ చైర్మన్ ఆసిఫ్‌, మాజీ ఫ్లోర్ లీడర్ శోభారాణి, మాజీ కౌన్సిలర్ పరిమళ రవీందర్, ఇర్ఫాన్, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, పాండురంగా రెడ్డి తదితరులు ఉన్నారు. https://www.dharshininews.com/44522/