schedule Tuesday, September 08, 2026

మెరుగైన వైద్య సేవలందించాలి

calendar_today September 12, 2022
person dharshininews
మెరుగైన వైద్య సేవలందించాలి
మెరుగైన వైద్య సేవలందించాలి - బస్తీ దవఖానను సందర్శించిన కౌన్సిల‌ర్, నేతలు - పరిశీలించిన డిప్యూటీ డీఎంహెచ్ఓ డా. ధరణి కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి: పేదలకు మెరుగైన వైద్యం అందించాలని తాండూరు మున్సిపల్ కౌన్సిలర్ బొంబీనా, నేత‌లు కోరారు. ఇటీవల పాత తాండూరులో ప్రారంభమైన బస్తీ దవాఖానను వార్డు కౌన్సిలర్ బొంబీనాతో పాటు నాయకులు సందర్శించి పరిశీలించారు. అదే సమయంలో వికారాబాద్ జిల్లా ఉప వైద్యాధికారి ధరణికుమార్ కూడ ఆసుపత్రిని సందర్శించారు. ఆయ‌న స‌మ‌క్షంలోనే బస్తీ దవఖానాలో పేదలకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. ప్రతి రోజు వైద్యులు సమయ పాలన పాటించాలని, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు వైద్య సేవలను అందించాలని అన్నారు. రోగులకు సరిపడా వైద్య సదుపాయాలు కల్పించాలని జిల్లా ఉప వైద్యాధికారి డా. ధరణికుమార్ ను కోరారు. మరోవైపు పేదలు బస్తీ దవాఖాన సేవలను పేద‌ల‌కు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ హనుమాన్ దేవాలయ చైర్మన్ సంజీవరావు, టీఆర్ఎస్ నాయకులు ఎర్రం శ్రీధర్, గుండప్ప, ఎంఐఎం నాయ‌కుల అన్వ‌ర్, వార్డు ఇంచార్జ్ ర‌వూఫ్ ఖాన్, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.