schedule Tuesday, September 08, 2026

విద్యార్థి తల్లితో ప్రిన్సిపల్ అసభ్య ప్రవర్తన..?!

calendar_today September 8, 2026
person dharshininews
విద్యార్థి తల్లితో ప్రిన్సిపల్ అసభ్య ప్రవర్తన..?!
విద్యార్థి తల్లితో ప్రిన్సిపల్ అసభ్య ప్రవర్తన..?! - ఎంజీపీ స్కూల్‌ ప్రిన్సిపల్‌పై వివాదం - ప్రిన్సిపల్‌పై దాడికి పాల్పడిన వ్యక్తులు - యాలాల పోలీస్టేషన్‌లో ఇరువర్గాలపై కేసులు తాండూరు, దర్శిని ప్రతినిధి : స్కూల్లో విద్యార్థిని కలిసేందుకు వచ్చిన తల్లితో ఫోన్‌లో అసభ్యంగా ప్రవర్తించినట్లు తాండూరులోని మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాల ప్రిన్సిపాల్‌పై వివాదం ఏర్పడింది. ఈ విషయంలో ప్రిన్సిపల్‌పై యాలాల మండలం అగ్గనూరు గ్రామ శివారులో కొందరు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన మంగళవారం జరిగింది. ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో యాలాల పోలీస్టేషన్‌లో కేసులు నమదయ్యాయి. యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మాయిపల్లికి చెందిన ఓ మహిళ కుమారుడు జ్యోతిబాపూలే పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. కుమారుడిని కలిసేందుకు పాఠశాలకు వెళ్లిన సమయంలో ఆమెకు ప్రిన్సిపాల్‌ నరేష్‌తో పరిచయం ఏర్పడింది. దీంతో ప్రిన్సిపల్ ఆమెతో ఫోన్‌లో అసభ్యకరంగా ప్రవర్తించాడనే విషయం సంబంధికులకు తెలిసింది. మంగళవారం ఈ విషయంపై నరేష్‌ను ప్రశ్నించేందుకు కృష్ణతో పాటు మరో ఇద్దరు అగ్గనూరు గ్రామ శివారుకు వచ్చారు. అక్కడ ఇరువర్గాల మధ్య వివాదం జరగడంతో నరేష్‌పై దాడి చేసినట్లు ప్రిన్సిపల్ ఫిర్యాదు చేయగా.. ప్రిన్సిపల్‌పై కూడా పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. https://www.dharshininews.com/44610/