schedule Tuesday, November 03, 2026

ఏ లోకంలో ఉన్నా.. మరువలేం..!

calendar_today November 3, 2026
person dharshininews
ఏ లోకంలో ఉన్నా.. మరువలేం..!
ఏ లోకంలో ఉన్నా.. మరువలేం..! - చేవేళ్ల ఆర్టీసీ మృతులకు కొవ్వొత్తుల నివాళి - పాల్గొన్న తాండూరు ప్రముఖులు, ప్రజలు - ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌, బీవీజీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం తాండూరు, దర్శిని ప్రతినిధి : రోడ్డు ప్రమాదం మరణించి.. ఏలోకంలో ఉన్నా ఇంకా.. మిమ్మల్ని మరువలేమని తాండూరు ప్రముఖులు, నేతలు చేవేళ్ల ఆర్టీసీ మృతులను స్మరించుకున్నారు. సరిగ్గా ఏడాది రోజున చేవెళ్ల బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకుంటూ తాండూరులో మంగళవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌, బీవీజీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజకీయ, సామాజిక, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏడాది క్రితం జరిగిన ఘోర ప్రమాదంలో 19 కుటుంబాల్లో తీరని విషాదం నెలకొనగా, వారిలో సుమారు 13 మంది తాండూరుకు చెందినవారు కావడంతో పట్టణ ప్రజలు మృతులను స్మరించుకుంటూ నివాళులర్పించారు. కాంగ్రెస్‌ నాయకుడు బుయ్యని శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ రాజుగౌడ్‌, బీఆర్‌ఎస్‌ నాయకుడు విఠల్‌రెడ్డి, డా. సంపత్ కుమార్ తదితరులు కొవ్వొత్తులు చేతబట్టి ర్యాలీలో పాల్గొన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని ఎప్పటికీ మరువలేమని, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పట్టణ ప్రముఖులు, కౌన్సిలర్లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, యువకులు, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ప్రతినిధులు పాల్గొని మృతుల జ్ఞాపకాలకు నివాళులర్పించారు. https://www.dharshininews.com/45267/