ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి
November 3, 2026
dharshininews
ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి
- అన్నింటినీ తీర్చేందుకు దృష్టి సారించండి
- పెండింగ్ పనులు పూర్తి చేయాలి
- ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించాలి
- అధికారులతో బుయ్యని శ్రీనివాస్‌రెడ్డి సూచన
తాండూరు, దర్శిని ప్రతినిధి: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు చొరవ చూపాలని ఆర్బీఓఎల్ సీఈవో బుయ్యని శ్రీనివాస్‌రెడ్డి కోరారు.
వివిధ సమస్యలతో కార్యాలయాలకు వచ్చే ప్రజలను ఇబ్బందులకు గురిచేయకుండా, వారి విజ్ఞప్తులను సానుకూలంగా పరిశీలించి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.మంగళవారం తాండూరు పట్టణంలో ఆర్‌అండ్‌బీ శాఖ, డీఎస్పీ, పురపాలక శాఖ అధికారులతో పాటు జిల్లా మాతా శిశు ఆసుపత్రి అధికారులను ఆయన కలిశారు.
ఆయా శాఖల పరిధిలో పెండింగ్‌లో ఉన్న పనుల వివరాలను తెలుసుకుని, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ప్రజలకు సంబంధించిన సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం జిల్లా మాతా శిశు ఆసుపత్రిని సందర్శించి వైద్యులు, సిబ్బంది, రోగులు, వారి బంధువులతో మాట్లాడారు.
ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. రోగులకు మెరుగైన చికిత్స అందించాలని, వైద్యులు, సిబ్బంది సేవాభావంతో పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఆయన వెంట కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
https://www.dharshininews.com/45261/