schedule Tuesday, November 03, 2026

హస్తినలో తాండూరు నేతల హోరు

calendar_today November 1, 2026
person dharshininews
హస్తినలో తాండూరు నేతల హోరు
హస్తినలో తాండూరు నేతల హోరు - ఓటు బచావో, దేశ్‌ బచావ్‌లో గళం - ఎమ్మెల్యేతో పాటు నేతల నిరసన తాండూరు, దర్శిని ప్రతినిధి : దేశంలో పేదలను ఓట్లను తొలగించేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని తాండూరు కాంగ్రెస్ నేతలు అన్నారు. కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఓటు బచావో, దేశ్‌ బచావో... నిరసన కార్యక్రమానికి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో పాటు నేతలు తరలి వెళ్లిన సంగతి తెలిసిందే. ఢిల్లిలోని ని రాంలీలా మైదానంలో జరిగిన నిరసలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటు అనేది ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ఉన్న అత్యంత విలువైన హక్కు అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా నిలవాలని అన్నారు. ‘ఓటు బచావో.. దేశ్‌ బచావో’ నినాదం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఓటు హక్కు ప్రాధాన్యతను చాటిచెప్పడం, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడమేనని తెలిపారు.కేంద్రంలో మోదీ కుర్చీ కాపాడేందుకు ఓట్ల తొలగింపు చేపడుతున్నారని ద్వజమెత్తారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ వెంటనే రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్ కన్వీనర్ కరణం పురుషోత్తం రావు, తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ వడ్డె శ్రీనివాస్, మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్, తట్టెపల్లి పీఏసీఎస్ చైర్మన్ జనార్దన్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ ప్రబాకర్ గౌడ్, పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు, మాజీ అధ్యక్షులు హబీబ్ లాల, నాయకులు అజయ్ ప్రసాద్, లోంక నర్సింలు, వివిధ మండలాల నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/45245/