schedule Tuesday, November 03, 2026

ఆపదలో ఉన్న కార్మికుడికి చైర్‌పర్సన్‌ చేయూత

calendar_today October 31, 2026
person dharshininews
ఆపదలో ఉన్న కార్మికుడికి చైర్‌పర్సన్‌ చేయూత
ఆపదలో ఉన్న కార్మికుడికి చైర్‌పర్సన్‌ చేయూత - వైద్య చికిత్స కోసం ఆర్థిక సాయం - పరామర్శించి ధైర్యం చెప్పిన నీరజా బాల్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి: అనారోగ్యంతో బాధపడుతున్న పారిశుద్ధ్య కార్మికుడికి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజ బాల్‌రెడ్డి చేయూత అందించారు. ఓల్డ్‌ తాండూరు 15వ వార్డులో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న జె. నవీన్‌కుమార్‌ కొన్ని రోజులుగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో శనివారం ఆయనను పట్టణంలోని జేబీ ఆసుపత్రికి తరలించి అత్యవసర వైద్య సహాయం అందించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. విషయం తెలుసుకున్న చైర్‌పర్సన్‌ నీరజ బాల్‌రెడ్డి, కౌన్సిలర్‌ దివిటీ ఎల్లప్ప స్పందించి వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 5వేల ఆర్థిక సహాయం అందించారు. అదేవిధంగా ఎట్టిపరిస్థితిలో మనోధైర్యం కోల్పోవద్దని.. అండగా ఉంటామని భరోసా అందించారు. పారిశుద్ధ్య కార్మికుడి పట్ల చైర్ పర్సన్, కౌన్సిలర్ మానవత్వం చాటు కోవడంతో కుటుంబీకులు ధన్యవాదాలు తెలిపారు.   https://www.dharshininews.com/45239/