schedule Tuesday, November 03, 2026

పట్టభద్రుల గొంతుకగా కొల్లూరు ఆకాశ్‌..!

calendar_today November 3, 2026
person dharshininews
పట్టభద్రుల గొంతుకగా కొల్లూరు ఆకాశ్‌..!
పట్టభద్రుల గొంతుకగా కొల్లూరు ఆకాశ్‌..! - బీసీ యువనేతకు టీఆర్ఎస్ పార్టీ ప్రాధాన్యం - ఎమ్మెల్సీ అభ్యర్థిగా అందరు ఆదరించాలి - తాండూరు టీఆర్ఎస్‌ నేతల మద్దతు తాండూరు, దర్శిని ప్రతినిధి: జర్నలిజం నుంచి ప్రజా సమస్యల పోరాటం వరకు తనదైన ముద్ర వేసిన సీనియర్‌ జర్నలిస్ట్‌ కొల్లూరు ఆకాశ్‌ ఇప్పుడు పట్టభద్రుల గొంతుకగా నిలుస్తారని తాండూరు తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్‌) పార్టీ నేతలు అన్నారు. మంగళవారం తాండూరు ఇంచార్జ్ బుస్సా రాఘవేందర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ ఆరూర్ వీరమణి తదితరులు మాట్లాడారు. హైదరాబాద్‌–రంగారెడ్డి–మహబూబ్‌నగర్‌ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి తెలంగాణ రక్షణ సేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయనకు పార్టీ నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో టీఆర్ఎస్‌ నాయకులు మాట్లాడుతూ.. బీసీ సామాజిక వర్గానికి చెందిన యువ జర్నలిస్టుకు ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం కల్పించడం గొప్ప విషయమన్నారు. ఈ అవకాశం కల్పించిన ఘనత పార్టీ అధ్యక్షురాలు కవితకు దక్కుతుందన్నారు. జర్నలిస్టుగా ప్రజల సమస్యలను దగ్గరగా చూసిన అనుభవం, వాటిపై ప్రశ్నించే స్వభావం, ప్రజల తరఫున పోరాడే తత్వం కొల్లూరు ఆకాశ్‌కు ఉన్నాయని పేర్కొన్నారు. పట్టభద్రుల సమస్యలను అర్థం చేసుకుని వాటి పరిష్కారం కోసం కృషి చేసే అవకాశం ఆయనకు కల్పించాలని నాయకులు అభిప్రాయపడ్డారు. విద్యావంతులు, నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలను ప్రస్తావించే గొంతుకగా ఆకాశ్‌ నిలుస్తారని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్‌ నాయకులు కోళ్ల శ్రీనివాస్‌, కళావతి, యాదయ్య, లావణ్య, ఇందిర, వినోద, స్వప్న తదితరులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/45265/