schedule Thursday, September 03, 2026

మట్టికథ మనందరిదే..!

calendar_today September 23, 2023
person dharshininews
మట్టికథ మనందరిదే..!
మట్టికథ మనందరిదే..! - చిత్ర డైరెక్టర్‌ పవన్ కడియాల - సినిమాను ఆదరించాలి సింధు డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ విజయాదేవి - తాండూరు కాలేజీలో చిత్ర బృందం సందడి తాండూరు, దర్శిని ప్రతినిధి : మనందరి జీవితాల్లో నుంచే పుట్టిన కథనే మట్టికథ సినిమాగా తీయడం జరిగిందని చిత్ర దర్శకుడు పవన్ కడియాల అన్నారు. తాండూరుకు చెందిన పవన్ కడియాల చిత్ర రంగంలో డైరెక్టర్‌గా మారి మట్టికథ అనే సినియా తీశారు. ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో 9 అవార్డులు వచ్చాయి. తాండూరులోని లక్ష్మీ మహాల్ థియేటర్‌లో సినిమా విడుదల సందర్బంగా శనివారం తాండూరులోని సిందూ డిగ్రీ కళాశాలలో మట్టికథ సినిమా డైరెక్టర్ పవన్ కడియాల, నటుడు నరేష్ లు సందడి చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో సమావేశమైన సినిమా ప్రాముఖ్యతను వివరించారు. డైరెక్టర్ పవన్ మాట్లాడుతూ మట్టిమనుషుల్లో నుంచి తీసిన సినిమాకు 9 ఇంటర్నేషనల్ అవార్డులు వచ్చాయని తెలిపారు. తాండూరు ప్రాంత వాసిగా మన కథను అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లినందుకు గర్వంగా ఉందన్నారు. అనంతరం ప్రిన్సిపల్ విజయాదేవి మాట్లాడుతూ తాండూరు ప్రాంతానికి చెందిన పవన్ కడియాల డైరెక్టర్ గా మారి మట్టికథ అనే సినిమా తీయడం అభినందనీయమన్నారు. సినిమా ద్వారా ప్రాముఖ్యతను తెలియజేయడం ప్రశంసనీయమన్నారు. మట్టికథ సినిమాను ఆదరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అరవింద్ రెడ్డి, రఘునందన్ రెడ్డి విద్యార్థులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://dharshininews.com/20515/