వంతెనలపై గళమెత్తిన ఎమ్మెల్యే మెతకు ఆనంద్
September 27, 2021
dharshininews
వంతెనలపై గళమెత్తిన ఎమ్మెల్యే మెతకు ఆనంద్
- త్వరగా పూర్తి చేయాలని అసెంబ్లీ సమావేశంలో విజ్ఞప్తి
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లా కేంద్ర పరిధిలోని అసంపూర్తి వంతెనలను త్వరగా పూర్తి చేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గళమెత్తారు. సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ప్రసంగిస్తూ వికారాబాద్ నియోజకవర్గంలో ధారూర్, పుల్‌మామిడి, సిద్దులూరు, నాగసముందర్‌లలో కోట్లాది రూపాయిలతో బ్రీడ్జీల పనులు జరుగుతున్నాయని తెలిపారు. ధారూర్‌లో రూ. 4.5కోట్లతో చేపడుతున్న వంతెన నిర్మాణం 30శాతం కూడ పూర్తికాలేదని అన్నారు. ధారూర్ మండలం నాగసముందర్ వద్ద రోడ్డు కోట్టుకుపోయి రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, మిగతా ప్రాంతాల్లో పనులు అసంపూర్తిగా ఉన్నాయని సమావేశంలో ఆర్అండ్‌బి శాఖ మంత్రి దృష్టికి తీసుకవచ్చారు. ఇందుకు ఆ శాఖ మంత్రి స్పందించి పనులు త్వరగా పూర్తిచేసేందుకు దృష్టిసారిస్తామని హామి ఇచ్చారు. దీంతో అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ వికారాబాద్ ప్రాంత సమస్యలపై గళమెత్తడంతో నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.