schedule Thursday, September 03, 2026

ప‌దో తరగతి, ఐటీఐ పాసైతే రైల్వే ఉద్యోగం..!

calendar_today October 6, 2021
person dharshininews
ప‌దో తరగతి, ఐటీఐ పాసైతే రైల్వే ఉద్యోగం..!
ప‌దో తరగతి, ఐటీఐ పాసైతే రైల్వే ఉద్యోగం - నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన రైల్వే శాఖ - సికింద్రాబాద్‌ ప్రధాన కేంద్రంగా ఖాళీల  భర్తీపై దృష్టి ద‌ర్శిని బ్యూరో : ప‌దో త‌ర‌గ‌తి, ఐటీఐ పాసైన నిరుద్యోగుల‌కు ఉద్యోగ‌వ‌కాశాలు క‌ల్పిస్తోంది రైల్వే శాఖ. రైల్వే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు మంచి శుభ‌వార్త‌ను తెలిపింది. సికింద్రాబాద్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 4,103 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. దక్షిణ మధ్య రైల్వేలోని 35 ఎస్టాబ్లిష్‌మెంట్‌లలోని 11 ట్రేడ్‌లలో ఈ 4,103 ఖాళీలను పూర్తి చేసేందుకు ఆసక్తి కలిగిన అభ్యర్తుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తు చేసుకోదలచిన అభ్యర్థులు పదవ తరగతి, ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాల‌ని స్ప‌ష్టం చేయ‌గా.. అభ్యర్థులను టెన్త్‌, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారం గా ఎంపిక చేయ‌డం జ‌ర‌గుతుంద‌ని తెలిపింది. వయసు: 24 ఏళ్లు మించకూడదు. అర్హత: పదవ తరగతి, ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.. ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, సర్వీస్‌ వెయిటేజీ, ఇంటర్న్‌షిప్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు: రూ.100 చెల్లించాలి. దరఖాస్తులకు ప్రారంభ తేది: అక్టోబర్ 4 వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి దరఖాస్తులకు చివరితేది: నవంబర్ 3 పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: scr.indianrailways.gov.in ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు అక్టోబర్ 4 వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి నవంబర్ 3 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడండి.