schedule Tuesday, September 08, 2026

మెకానిక్‌ను వ‌రించిన అదృష్టం

calendar_today October 11, 2021
person dharshininews
మెకానిక్‌ను వ‌రించిన అదృష్టం
మెకానిక్‌ను వ‌రించిన అదృష్టం - లాట‌రీలో రూ. 1.5 కోట్ల జాక్‌పాట్ ద‌ర్శిని బ్యూరో: లోకంలో అదృష్ట దేవ‌త వ‌రిస్తే ఎవ‌రి జీవిత‌మైన రాత్రికి రాత్రే మారిపోతోంది. అప్పటి వరకు ధనవంతుడిగా ఉన్న వ్యక్తి పేదవాడు కావొచ్చు.. పేదవాడిగా ఉన్న వ్యక్తి రాత్రికి రాత్రే ధనవంతుడు కావొచ్చు. అదృష్టల‌క్ష్మీ క‌టాక్షం అలాంటిది మ‌రి. అలాంటి అదృష్ట దేవత వ‌రించ‌డంతో రూ. 1.5 కోట్ల‌ను సంపాదించాడు. క‌ష్ట‌ప‌డి సంపాదించ‌డనుకుంటే పొర‌పాటే. లాట‌రీ టికెట్ ద్వారా డ‌బ్బుల‌ను సొంతం చేసుకున్నాడు. అమెరికా నార్త్‌ కరోలినాలో ఫ్రాంక్‌విల్లే ప్రాంతానికి చెందిన గ్రెగరీ వారెన్‌ గ‌త నెల సెప్టెంబరు 29న ఓ చోట గ్యాస్‌ ఫిల్లింగ్‌ చేయడానికి వెళ్లాడు. అక్కడ ‘క్యాష్‌ 5 లాటరీ’ అమ్మే వ్యక్తి టికెట్ కొనండి సార్ అని అడిగాడు. దీంతో వారెన్ టికెట్టును కొనుగోలు చేశాడు. అక్టోబరు 4వరకు అతడు ఆ టికెట్‌ సంగతే పట్టించుకోనే లేదు. అనూహ్యంగా అతడు కొనుగోలు చేసిన టికెట్టే లాటరీలో జాక్‌పాట్‌ గెలుచుకుంది. పన్నుల తర్వాత.. వారెన్ దాదాపు రూ. కోటి చెక్కును అందుకున్నాడు. ఇప్పుడు ఆ డబ్బులతో తన కుటుంబ కలలను తీర్చాలని అతడు ఆశపడుతున్నాడు.