schedule Thursday, September 03, 2026

పానం పోయినా పాలే ముఖ్యం..!

calendar_today August 7, 2024
person dharshininews
పానం పోయినా పాలే ముఖ్యం..!
పానం పోయినా పాలే ముఖ్యం..! - మానవత్వాన్ని మరిచిన మనుషులు - సోషల్ మీడియాలో విమర్శాత్మకం దర్శిని డెస్క్ : మాయమైపోతున్నడమ్మా అనే పాటకు ఈ సంఘటన ఓ ఉదహరణ. రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించి.. మరో వ్యక్తి గాయాలతో ఉన్న పట్టించుకోని మనషులు ప్రమాదంలో ట్యాంకు నుంచి వెళుతున్న పాలే ముఖ్యమని దయనీయంగా ప్రవర్తించారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో తీవ్ర విమర్శాత్మకమైంది. వివరాల్లోకి వెళితే.. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. యూపీలోని గాజియాబాద్‌లో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ పాల ట్యాంకర్‌ను వెనక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఝార్ఖండ్‌కు చెందిన లారీ డ్రైవర్‌ ప్రేమ్‌ సాగర్‌ (45) అక్కడికక్కడే మృతిచెందారు. క్లీనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మేరఠ్‌ వెళ్తుండగా దిల్లీ-మేరఠ్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై ఏబీఈఎస్‌ కాలేజ్‌ సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో లారీ నుజ్జునుజ్జయ్యింది. ట్యాంకర్‌ సైతం దెబ్బతినడంతో పాలు బయటకు వచ్చాయి. గమనించిన స్థానికులు వాటిని పాత్రలు, బాటిళ్లలో నింపే పనిలో పడ్డారు. అక్కడే పడి ఉన్న డ్రైవర్‌ మృతదేహాన్ని గానీ, గాయపడిన క్లీనర్‌నుగానీ ఎవరూ పట్టించుకోలేదు. దీన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయటంతో అది వైరలైంది. స్థానికులపై నెటిజన్లు పెద్ద ఎత్తున దుమ్మెత్తి పోస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తామన్నారు. https://twitter.com/i/status/1821073046943244588 ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/28113/