schedule Thursday, September 03, 2026

మీకు రేషన్‌ బియ్యం ఆగిపోవచ్చు..!

calendar_today November 5, 2024
person dharshininews
మీకు రేషన్‌ బియ్యం ఆగిపోవచ్చు..!
మీకు రేషన్‌ బియ్యం ఆగిపోవచ్చు..! - వెంటనే ఆ పని పూర్తి చేయండి - లేకుండా సరఫరా బంద్ దర్శిని డెస్క్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల కోసం రేషన్ బియ్యం పంపిణీ పథకంను అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న పథకాన్ని 2028 వరకు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. రేషన్ కార్డు ఉన్న పేదలు ఎంతో మంది బియ్యం పొందుతున్నారు. తాజాగా అర్హులైన పేదలకు కూడా కొత్త రేషన్ కార్డులను అందజేయబోతోంది. అయితే ఇప్పటికే రేషన్ కార్డు కలిగిన వారు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. లేదంటే మాత్రం ఇబ్బందులు పడాల్సి రావొచ్చు. హైదరాబాద్ అధికారులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అందించే ఉచిత బియ్యం పొందాలంటే.. కచ్చితంగా రేషన్ కార్డు కలిగిన వారు ఇకేవైసీ చేసుకోవాలని సూచించారు. లేకపోతే ఈ స్కీమ్ కింద ప్రయోజనం పొందలేరని వెల్లడించారు. అందువల్ల మీరు ఇంకా రేషన్ కార్డు ఇకేవైసీ చేసుకోకపోతే మాత్రం.. వెంటనే ఆ పని చేసుకోండి. లేదంటే మాత్రం మీకు ఉచిత బియ్యం పొందలేరు. ఇంకా కార్డు కూడా రద్దు కావొచ్చు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. అర్హులైన లబ్దిదారులు వెంటనే ఈకేవైసీ చేసుకోవడం మంచింది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30358/