schedule Thursday, September 03, 2026

విద్యార్థులకు రూ. 10లక్షలు..!

calendar_today November 11, 2024
person dharshininews
విద్యార్థులకు రూ. 10లక్షలు..!
విద్యార్థులకు రూ. 10లక్షలు..! - కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం - ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు, అక్కడే మంజూరు - అర్హులు, దరఖాస్తులు ప్రక్రియ ఎలా ఉంటుందంటే..? దర్శిని డెస్క్ : దేశంలోని పేద విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని అమలు చేయబోతోంది. విద్యార్థుల చదువు కోసం రూ. 10లక్షల వరకు ఆర్థిక సాయాన్ని అందించబోతోంది. అర్హులైన విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకోవడానికి, రుణం కోసం దరఖాస్తులు పెట్టుకోవడానికి, వడ్డీ మొత్తాన్ని చెల్లించడానికీ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పీఎం-విద్యాలక్ష్మి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రుణాల మంజూరు ప్రక్రియ మొత్తం కూడా ఈ పోర్టల్ ద్వారానే కొనసాగుతుంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం పీఎం విద్యాలక్ష్మి పథకాన్ని ఆమోదించింది. ఈ పథకం ద్వారా ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం ఉద్దేశం, తద్వారా ఎవరూ ఆర్థిక పరిమితుల కారణంగా ఉన్నత విద్యను కోల్పోకుండా ఉంటారు. ఈ పథకం విద్యార్థుల కోసం తగిన విద్యా రుణాలు అందించడమే కాకుండా, వారి విద్యా ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. విద్యాలక్ష్మి రుణాలకు ఎటువంటి తనఖా, ష్యూరిటీలు అవసరం లేదని.. రూ.8 లక్షల కుటుంబ వార్షిక ఆదాయమున్నవారు విద్యాలక్ష్మి పథకానికి అర్హులని కేంద్రం తెలిపింది. ఈ పథకం ప్రతి ఏడాది సుమారు 22 లక్షల మంది విద్యార్థులను కవర్ చేయడమే లక్ష్యం. ఈ పథకం ద్వారా రూ. 7.5 లక్షల వరకు రుణం 75% క్రెడిట్ గ్యారెంటీతో ప్రభుత్వం అందిస్తుంది. ఈ పథకానికి సుమారు రూ. 3600 కోట్ల బడ్జెట్ కేటాయించబడింది. అర్హతలు అభ్యర్థి భారతదేశ స్థిర నివాసి అయి ఉండాలి. అర్హత ఉన్న ఉన్నత విద్యా సంస్థలో ప్రవేశం పొందిన విద్యార్థులు ఈ పథకంలో రుణం పొందవచ్చు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థి 12వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 12వ తరగతి పూర్తి చేసిన తర్వాత ఉన్నత విద్యను పొందదలిచిన వారికి ఆర్థిక సహాయం అందుతుంది. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 8 లక్షలు ఉన్న వారికి 3% వడ్డీ సబ్సిడీ లభిస్తుంది. రూ. 4.5 లక్షల ఆదాయం ఉన్న వారికి పూర్తిగా వడ్డీ సబ్సిడీ. అర్హత ఉన్న విద్యా సంస్థలు ఏవంటే.. NIRF ర్యాంకింగ్స్ ప్రకారం, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అన్ని సంస్థలు, మరియు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు (101–200 ర్యాంకింగ్ కలిగినవి) ఈ పథకంలో భాగమవుతాయి. కావాల్సిన పత్రాలు ఇవే... ఆధార్ కార్డు, ఇమెయిల్ ఐడి, మొబైల్ నంబర్, 11వ మరియు 12వ తరగతుల మార్క్ షీట్, ప్రవేశ పత్రం, నివాస ధృవీకరణ, బ్యాంక్ ఖాతా వివరాలు, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు. దరఖాస్తు ఇలా... మొదట అభ్యర్థి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. “Apply Now” బటన్‌పై క్లిక్ చేయాలి. పూర్తి పేరు, చిరునామా, ఇమెయిల్, మొబైల్ నంబర్ మొదలైన సమాచారాన్ని నమోదు చేయాలి. అవసరమైన పత్రాలు అప్‌లోడ్ చేసి “Submit” పై క్లిక్ చేయాలి. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30448/