schedule Thursday, September 03, 2026

పసిడి ప్రియులకు శుభవార్త..!

calendar_today December 2, 2024
person dharshininews
పసిడి ప్రియులకు శుభవార్త..!
పసిడి ప్రియులకు శుభవార్త..! - భారీగా తగ్గిన బంగారం, వెండి - తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇవే.. దర్శిని డెస్క్ : బంగారం, వెండి కొనుగోలు దారులకు నిజంగా ఇది శుభార్తే. దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. సోమవారం నాటికి రూ.921 తగ్గి రూ.78,094కు చేరుకుంది. ఒక రోజు ముందు అంటే ఆదివారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.79,015 ఉంది. అదేవిదంగా కిలో వెండి ధర రూ.91,662 ఉండగా, సోమవారం నాటికి రూ.1,119 తగ్గి రూ.90,543కు చేరింది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఈ విధంగా ఉన్నాయి. హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.78,094గా ఉంది. కిలో వెండి ధర రూ.90,543గా ఉంది. విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.78,094గా ఉంది. కిలో వెండి ధర రూ.90,543గా ఉంది. విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.78,094గా ఉంది. కిలో వెండి ధర రూ.90,543గా ఉంది. ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.78,094గా ఉంది. కిలో వెండి ధర రూ.90,543గా ఉంది. గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/31093/