schedule Thursday, September 03, 2026

అవిసె గింజల్లో ఆరోగ్య మంత్రం..!

calendar_today December 27, 2024
person dharshininews
అవిసె గింజల్లో ఆరోగ్య మంత్రం..!
అవిసె గింజల్లో ఆరోగ్య మంత్రం..! - శీతాకాలం జలుబు, దగ్గు సమస్యకు చెక్ - గ్యాస్, అజీర్తీల నుంచి ఉపశమనం - వేయించుకు తింటే మంచి ఫలితాలు దర్శిని డెస్క్ : అవిసె గింజులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహంతో పాటు శీతాకాలం సమస్యలను అదుపులో పెట్టినట్టే. ఇందులో విటమిన్-బి1, ప్రొటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, కాపర్, ఫోలేట్, మెగ్నీషియం, మాంగనీస్, జింక్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. అయితే, వేయించిన అవిసె గింజలను తీసుకోవడం వల్ల అధిక కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవిసెలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఒక టేబుల్ స్పూన్ వేయించిన అవిసె గింజలను తీసుకుంటే కొలెస్ట్రాల్‌ సమస్యను దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. శీతాకాలంలో ఎక్కువగా జలబు, దగ్గు వంటి సీజనల్‌ వ్యాధులు వెంటాడుతాయి.ఇలాంటి వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు అవిసె గింజలను తీనడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అవిసె గింజల్లో కూడా ఒమేగా-3, కొవ్వు ఆమ్లాలు, అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. వేయించిన అవిసె గింజలను తినడం మధుమేహం బాధితులకు చాలా ఉపయోగకరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర శోషణను నెమ్మదిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. దీని రెగ్యులర్ వినియోగం మధుమేహం లక్షణాలను తగ్గిస్తుంది. అవిసె గింజలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అజీర్ణం విషయంలో, వేయించిన అవిసె గింజల పొడిని తీసుకోవచ్చు. అవిసె గింజలు గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. మీరు గోరువెచ్చని నీటితో వేయించిన అవిసె గింజల పొడిని తీసుకోవచ్చు. వేయించిన అవిసె గింజలను తీసుకోవడం వల్ల నిద్రలేమికి సహాయపడుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించడం ద్వారా నిద్రను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అవిసె గింజల్లో ఫైబర్ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు జీర్ణశక్తిని రెట్టింపు చేస్తుంది. నాన్ వెజ్ తినని వారు కోడిగుడ్డు బదులు అవిసె గింజలు తీసుకోవడం మేలు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/31691/