schedule Thursday, September 03, 2026

మాంచి కిక్కిచ్చే నూస్..!

calendar_today December 28, 2024
person dharshininews
మాంచి కిక్కిచ్చే నూస్..!
మాంచి కిక్కిచ్చే నూస్..! - మందుబాబులకు పండగే - ఆరోజు అర్దరాత్రి వరకు మద్యం విక్రయాలు - తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని మందుబాబులకు ప్రభుత్వం మంచి కిక్కు ఇచ్చే వార్త చెప్పింది. మరో రెండు రోజుల్లో పాత సంవత్సరం ముగిసి, కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో మద్యం విక్రయాలపై సడలింపు కల్పించింది. డిసెంబర్ 31, న్యూఇయర్ వేడుకలకు కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31 నాడు తెలంగాణలో మద్యం షాపులను అర్థరాత్రి 12 గంటల వరకూ తెరవవచ్చు అని ప్రభుత్వం చెప్పింది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం బార్లు రెస్టారెంట్లను అర్థరాత్రి 1 గంట వరకూ తెరచి ఉండొచ్చని తెలిపింది. అలాగే.. రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఈవెంట్లను రాత్రి 1 గంట వకూ జరుపుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. స్వయంగా జీవో కూడా జారీ చేసింది. అందువల్ల కొత్త సంవత్సరానికి లిక్కర్ పార్టీతో వెల్‌కమ్ చెప్పాలనుకునేవారికి.. మద్యం దొరకదనే సమస్య తీరినట్లే. ఇక అర్థరాత్రి మద్యం ఫుల్ డిమాండ్ ఉంటుందనుకోవచ్చు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/31723/