schedule Thursday, September 03, 2026

రైతు భరోసాకు ముహుర్తం ఫిక్స్‌..!

calendar_today January 4, 2025
person dharshininews
రైతు భరోసాకు ముహుర్తం ఫిక్స్‌..!
రైతు భరోసాకు ముహుర్తం ఫిక్స్‌..! - ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంతో అమలు - కొత్త రేషన్ కార్డుల జారీ కూడా అప్పుడే - ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల జనవరి 26 నుంచి రైతు భరోసా, కొత్త రేషన్‌ కార్డులు అందించేందుకు ముహుర్తం ఫిక్స్ చేసింది. ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం’ అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. శనివారం . రైతులకు సాయం కింద ఇచ్చే రైతు భరోసాలోని షరతులు, విధివిధానాలపైనే ప్రధానంగా చర్చ జరిపారు. కేబినెట్‌ సమావేశం ముగిసిన తర్వాత మంత్రి వర్గ నిర్ణయాలను సీఎం మీడియాకు వివరించారు. ‘‘తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి నూతన సంవత్సరంలో మంచి జరగాలి. రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా ఇస్తాం. ప్రతి ఎకరాకు ఏడాదికి రూ.12వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. భూమిలేని వ్యవసాయ కుటుంబాలకు ఏడాదికి రూ.12 వేలు ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఈ పథకానికి ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ అని నామకరణం చేశాం. జనవరి 26 నుంచి రైతు భరోసా, కొత్త రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు అమలు చేస్తాం’’ అని సీఎం ప్రకటించారు. దీంతో పార్టీ నేతలు, నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/32004/