schedule Thursday, September 03, 2026

తెలంగాణలో తేలిన ఓటర్ల లెక్క..!

calendar_today January 6, 2025
person dharshininews
తెలంగాణలో తేలిన ఓటర్ల లెక్క..!
తెలంగాణలో తేలిన ఓటర్ల లెక్క..! - పురుషులు, మహిళలు ఎంతంటే..? - అత్యధికంగా ఉన్న ప్రాంతం అదే హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : తెలంగాణలో ఓటర్ల లెక్క తేలింది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను ప్రకటించింది. సోమవారం సవరించిన ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. జాబితా ప్రకారం.. రాష్ట్రంలో మొత్తంగా 3,35,27,925 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 1,66,41,489 మంది పురుషులు, 1,68,67,735 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 2,829 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. శేరిలింగంపల్లిలో అత్యధికంగా 7,65,982 మంది, అత్యల్పంగా భద్రాచలంలో 1,54,134 ఓటర్లు ఉన్నారు. 18 నుంచి 19 సంవత్సరాల వయసున్న ఓటర్లు - 5,45,026, 85 సంవత్సరాలు దాటిన సీనియర్ ఓటర్లు - 2,22,091, ఎన్ఆర్‌ఐ ఓటర్లు - 3,591, ప్రత్యేక ప్రతిభావంతులు ఓటర్లు - 5,26,993లు ఉన్నట్లు వెల్లడించింది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/32068/