schedule Thursday, September 03, 2026

ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తన్నారా..?

calendar_today May 1, 2025
person dharshininews
ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తన్నారా..?
ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తన్నారా..? - నేటి నుంచి పెరిగిన చార్జీలు - ఎందుకు.. ఎంత పెంచారో తెలుసుకోండి దర్శిని డెస్క్ : సాంకేతిక యుగంలో బ్యాంకు ఖాతాలు ఉన్న ప్రతి ఒక్కరికి ఏటిఏం కార్డులు ఉంటాయి. వీటి ద్వారా అవసరమైనప్పుడు డబ్బులు డ్రా చేసుకుంటారు. అయితే ఆర్బీఐ రూల్స్ ప్రకారం.. ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసేందుకు ఫీజులను నిర్ణయించింది. ఈ ఫీజులను వచ్చేనెల 1వ తేది అంటే రేపటి నుంచి పెంచేందుకు కసరత్తు చేసింది. ఈ నిర్ణయంతో వినియోగదారులకు మునుపటి కంటే కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది. గతంలో మీరు మీ హోమ్‌ బ్రాంచ్‌ బ్యాంకు ఏటీఎం నుండి కాకుండా వేరే బ్యాంకు ఏటీఎం నుండి డబ్బు తీసుకుంటే మీరు రూ. 17 చెల్లించాల్సి ఉండేది. ఇప్పుడు అది రూ. 19 అవుతుంది. ఇతర బ్యాంకు ATM నుండి బ్యాలెన్స్ తనిఖీ చేయడానికి, గతంలో ఒకరు 6 రూపాయలు చెల్లించాల్సి ఉండేది. ఇప్పుడది 7 రూపాయలకు పెరగనుంది. ఏటీఎం ఇంటర్‌చేంజ్ ఫీజులను పెంచడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకులకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. దీని కారణంగా ఏదైనా ఉపసంహరణ జరిగితే లేదా హోమ్ బ్యాంక్ నెట్‌వర్క్ వెలుపల ఉన్న ATM నుండి బ్యాలెన్స్ తనిఖీ చేస్తే అది మీకు మునుపటి కంటే కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NTPC) పంపిన ATM ఫీజులను పెంచే ప్రతిపాదనను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆమోదించింది. బ్యాలెన్స్ విచారణ, మినీ స్టేట్‌మెంట్ మొదలైన సేవలకు, ఎస్‌బీఐ ఏటీఎంలలో ఎటువంటి ఛార్జీలు లేవు. లావాదేవీ రుసుము ఇతర బ్యాంకు ఏటీఎం నుండి మాత్రమే వసూలు చేయబడుతుంది. మీరు ఉచిత లావాదేవీ పరిమితిని దాటినప్పుడు మెట్రో నగరాల్లో, హోమ్ బ్యాంక్ కాకుండా ఇతర బ్యాంకుల ఏటీఎంల నుండి ఉచిత లావాదేవీల పరిమితి 5 అయితే, మెట్రోయేతర నగరాల్లో ఉచిత లావాదేవీల పరిమితి 3. అయితే మీరు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఇలా చేస్తే, ప్రతి లావాదేవీకి మీకు రూ.10 + GST ​చెల్లించాల్సి ఉంటుంది. మీ పొదుపు ఖాతాలో తగినంత నిధులు లేనందున మీ ఏటీఎం లావాదేవీ విఫలమైతే, ఇప్పటికే వర్తించే విధంగా జరిమానా రూ. 20 + GST ​​అలాగే ఉంటుంది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/35255/