schedule Thursday, September 03, 2026

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

calendar_today August 21, 2025
person dharshininews
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి - పరిసరాలను పరిశుభ్రత తప్పనిసరి - మాజీ కౌన్సిలర్ సంగీత ఠాకూర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాండూరు మున్సిపల్ 20వ వార్డు మాజీ కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ అన్నారు. kvcs గురువారం వార్డులోని గాంధీనగర్ లో వైద్య శాఖ, మున్సిపల్ శాఖల అధ్వర్యంలో మందులను పిచికారి చేశారు. సంగీత ఠాకూర్ వైద్య అధికారులు, సిబ్బందితో కలిసి కాలనీలో పలు పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. సంగీత ఠాకూర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. భారీ వర్షాలు పడిన నేపథ్యంలో అందరు దోమల నియంత్రణపై దృష్టిసారించాలన్నారు. మలేరియా, డెంగ్యూ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. ఇండ్లలోని గోళాలు, నీటితొట్లు, బాటిళ్లలలో నీళ్లు నిల్వ ఉంచకుండా, ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలన్నారు. మన ఆరోగ్యం.. మనం జాగ్రత్తగా కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డా. రాజేశ్వరి, ఏఎన్ఎం శాంత, ఆశ వర్కర్ సుజాత, షభానా, మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/37973/