schedule Thursday, September 03, 2026

స్కూల్ విద్యార్థులకు సూపర్ చాన్స్..!

calendar_today August 25, 2025
person dharshininews
స్కూల్ విద్యార్థులకు సూపర్ చాన్స్..!
స్కూల్ విద్యార్థులకు సూపర్ చాన్స్..! - ఫోస్టాఫీసు ద్వారా రూ. 6వేల స్కాలర్ షిప్‌ - అర్హతలు, దరఖాస్తులకు గడువు ఇదే - ఎలా, ఎక్కడ అప్లై చేయాలంటే..? దర్శిని డెస్క్ : ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు కేంద్రం సూపర్ చాన్స్ అందిస్తోంది. పోస్టాఫీసు శాఖ ద్వారా నెలకు రూ. 500 చొప్పున సంవత్సరానికి రూ. 6వేలు అందించే అవకాశం కల్పిస్తోంది. ‘దీన్‌ దయాళ్‌ స్పర్శ్‌ యోజన స్కాలర్‌షిప్‌- 2025 అందించేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతోంది. kvcs ఆరు నుంచి తొమ్మిదో తరగతి చదివే విద్యార్థులు ఎవరైనా ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకంలో 6 నుంచి 9 తరగతులు చదివే విద్యార్థులు ఎవరైనా ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 21న నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. స్కూల్లో చదువుతున్న విద్యార్ధులు సెప్టెంబరు 13, 2025వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎంపికలు ఇలా తపాలా బిళ్లల సేకరణ, ఫిలాటలీతో కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించేందుకు ఏటా తపాలాశాఖ ఎంపిక పరీక్ష ద్వారా స్కాలర్‌షిప్‌లు అందిస్తోంది. ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపిక ప్రక్రియ మొత్తం రెండు దశల్లో ఉంటుంది. తొలిదశలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఇక రెండోది ప్రాజెక్టు వర్క్‌. ప్రిలిమినరీ పరీక్షలో మొత్తం 50 ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. ఇందులో చరిత్ర, క్రీడలు, సాంఘికశాస్త్రం, సామాన్యశాస్త్రం, జనరల్‌ నాలెడ్జ్, స్టాంపులు వంటి సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇందులో అర్హత సాధించినవారు 16 స్టాంపులతో 4 నుంచి 5 పేజీలకు మించకుండా ప్రాజెక్టు వర్క్‌ చేయాల్సి ఉంటుంది. అనంతరం సంబంధిత తపాలాశాఖ రీజినల్‌ ఆఫీసు చిరునామాకు తమ ప్రాజెక్టు వర్క్‌ను పోస్ట్‌ ద్వారా విద్యార్ధులు పంపాల్సి ఉంటుంది. నగదు ఎలా అందిస్తారంటే..? ఈ రెండు దశల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను విజయవాడ, హైదరాబాద్‌లోని తపాలాశాఖ సర్కిల్‌ అధికారులు ఎంపిక చేసి మెరిట్‌ జాబితా విడుదల చేస్తారు. ఇలా ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు ఒక్కో తరగతి నుంచి 10 మంది చొప్పున మొత్తం 40 మంది విద్యార్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.500 చొప్పున ఏడాదికి ఒక్కొక్కరికి రూ.6 వేల వరకు స్కాలర్‌షిప్‌ అందిస్తారు. ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలకు సమీపంలోని సూపరింటెండెంట్‌ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/37378/