schedule Thursday, September 03, 2026

మహిళా సమాజానికి స్పూర్తి సరళా శ్రీనివాస్ రెడ్డి

calendar_today September 7, 2025
person dharshininews
మహిళా సమాజానికి స్పూర్తి సరళా శ్రీనివాస్ రెడ్డి
మహిళా సమాజానికి స్పూర్తి సరళా శ్రీనివాస్ రెడ్డి - బషీరాబాద్ మాజీ ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్ - సరళారెడ్డికి బెస్ట్ అవార్డుపై అభినందనలు తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలో మహిళ సమాజానికి తాండూరుకు చెందిన బుయ్యని సరళా శ్రీనివాస్ రెడ్డి స్పూర్తిగా నిలుస్తున్నారని బషీరాబాద్ మండల మాజీ ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్ అన్నారు. kvcs కాంగ్రెస్ నాయకురాలు, ఆర్బీఓఎల్ ఎండి బుయ్యని సరళా రెడ్డి ఇటీవల హైదరాబాద్ లో ఓ ప్రైవేటు సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా తెలుగు రాష్ట్రాల్లోనే బెస్ట్ ఎక్సలెన్స్ బిజినెస్ -2025 అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం బుయ్యని సరళారెడ్డిని ఆమె నివాసంలో బషీరాబాద్ మాజీ ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. బెస్ట్ అవార్డు పొందడం పట్ల సరళారెడ్డిని సన్మానించి అభినందనలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కృషి, పట్టుదల, అంకితభావం ఉంటే మహిళలు ఏ రంగాల్లో అయినా రాణించగలుగుతారని సరళా రెడ్డి నిరూపించారని అన్నారు. సరళారెడ్డి మహిళ సమాజానికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నవాంధీ పీఏసీఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, చందర్ నాయక్ లు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38447/