schedule Wednesday, September 09, 2026

రైతులను రోడ్డున పడేసిన సర్కారు

calendar_today September 9, 2025
person dharshininews
రైతులను రోడ్డున పడేసిన సర్కారు
రైతులను రోడ్డున పడేసిన సర్కారు - జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్‌ - యూరియా రైతుల కష్టాలపై ఆగ్రహం తాండూరు, దర్శిని ప్రతినిధి : రైతులను రోడ్డున పడేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ విమర్శించారు. kvcs మంగళవారం తాండూరు పట్టణం రైల్వే స్టేషన్ మార్గంలోని మన గ్రోమోర్ వద్ద యూరియా బస్తాల కోస బారులు తీరిన రైతులతో రాజుగౌడ్ మాట్లాడారు. యూరియా కోసం పడుతున్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తుందని మండిపడ్డారు. రైతు బంధు, రైతు బీమా, భరోసా పథకాలను సక్రమంగా అమలు చేయడం లేదని విమర్శించారు. కోరి తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు కష్టాలు పడుతున్నారని అన్నారు. రైతులను రోడ్డుపైకి తెచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాకి దక్కుతుందని అన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం, అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు అండగా పోరాట చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం, నాయకులు, రైతులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38474/