schedule Wednesday, September 09, 2026

పట్టణాభివృద్ధికి ఫోకస్ పెట్టండి..!

calendar_today September 10, 2025
person dharshininews
పట్టణాభివృద్ధికి ఫోకస్ పెట్టండి..!
పట్టణాభివృద్ధికి ఫోకస్ పెట్టండి..! - పారిశుద్ధ్యంలో నిర్లక్ష్యం వహించరాదు - తాండూరు మున్సిపల్ కమీషనర్ యాదగిరి - పట్టణంలోని పలు వార్డులో మార్నింగ్ వాక్ - అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణ అభివృద్ధిపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలని తాండూరు మున్సిపల్ కమీషనర్ యాదగరి ఆదేశించారు. బుధవారం ఉదయం కమీషనర్ పట్టణంలోని పలు వార్డులలో మార్నింగ్ వాక్ చేపట్టారు. kvcs బసవణ్ణ కట్ట, పాత కూరగాయల మార్కెట్లో పర్యటించారు. ఆయా కాలనీలలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. అంతకుముందు కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికుల అటెండెన్స్ ను పరిశీలించారు. మరోవైపు కార్యాలయంలో మున్సిపల్ డీఈ, ఏఈలతో పాటు పలు విభాగాల అధికారులు, వార్డు ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ పట్టణంలో అభివృద్ధి పనులపై దృష్టిసారించాలన్నారు. విద్యుత్ సమస్యలు రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. గ్రీన్ బడ్జెట్ కింద పార్కుల అభివృద్ధికి శ్రద్ధ తీతీసుకోవాలన్నారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి పట్టణ అభివృద్ధిపై దృష్టిసారించాలన్నారు. అదేవిధంగా పట్టణంలో పారిశుద్ధ్య పనులపై నిర్లక్ష్యం వహించరాదని, పనులు ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని శానిటరీ ఇను స్పెక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిప మేనేజర్ నరేందర్ రెడ్డి, డీఈ మణిపాల్, ఏఈ ఖాజా హుస్సేన్, ఉదయ్ కుమార్, శానిటరి ఇను స్పెక్టర్లు ఉమేష్, వెంకటయ్య, టౌన్ ప్లానింగ్ అధికారి ప్రియా, అకౌంటెంట్ శివకుమార్, వాణి, వార్డు ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38505/