schedule Wednesday, September 09, 2026

బుయ్యని దంపతులకు సన్మానం

calendar_today September 11, 2025
person dharshininews
బుయ్యని దంపతులకు సన్మానం
బుయ్యని దంపతులకు సన్మానం - శుభాకాంక్షలు తెలిపిన వ్యాపారులు - సరళారెడ్డికి బెస్ట్ అవార్డు పట్ల హర్షం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, ఎండీ బుయ్యని సరళా రెడ్డి దంపతులకు శుభాకాంక్షల వెల్లువ కొనసాగింది. kvcs ఇటీవల ప్రైవేటు మీడియా సంస్థ ఆధ్వర్యంలో బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్-2025 కార్యక్రమంలో ఆర్బీఓఎల్ ప్యాక్టరీ ఎండీ బుయ్యని సరళా రెడ్డికి తెలుగు రాష్ట్రాల్లోనే సుస్థిరమైన వ్యాపారవేత్తగా బెస్ట్ ఎక్సలెన్స్ అవార్డ్ దక్కింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా బుయ్యని సరళా రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. ఇందులో భాగంగా బుధవారం రాత్రి శ్రీనివాస్ రెడ్డి, సరళా రెడ్డి దంపతులను తాండూరు క్వారీ ఓనర్స్ వెల్పేర్, స్టోన్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు, వ్యాపారులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. శ్రీనివాస్ రెడ్డి, సరళారెడ్డి దంపతులను సన్మానించి.. సరళారెడ్డికి బెస్ట్ అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో క్వారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్‌, ఉపాధ్యక్షులు ఓం ప్రకాష్ సోమాని, మహమ్మద్ అన్వర్ అహమద్, ప్రధాన కార్యదర్శి సయ్యద్ జుబేర్ లాల, స్టోన్ మర్చంట్స్‌ వెల్పేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38499/