schedule Thursday, September 03, 2026

విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందిచడమే లక్ష్యం

calendar_today September 20, 2025
person dharshininews
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందిచడమే లక్ష్యం
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందిచడమే లక్ష్యం - పెరుమాళ్ల ఎడ్యూకేటషనల్‌ సోసైటి చైర్మన్ పి. వెంకట్ రెడ్డి - శ్రీసాయిమేధాలో అట్టహాసంగా ఇన్వెస్టిచర్ సెర్మనీ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఉపాధ్యాయులు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించ‌డంతో పాటు జవాబుదారితనం పాటించేలా తయారు చేయాలని పెరుమాళ్ల ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్, శ్రీ సాయి మేధ విద్యాలయ కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి అన్నారు. శనివారం తాండూరు పట్టణం శివాజీ చౌక్ లోని శ్రీ సాయి మేధ విద్యాలయంలో విద్యార్థులకు నాయకత్వ బాధ్యతల అప్పగింత (ఇన్వెస్టిచర్‌ సెర్మనీ)పై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. స్కూల్ పీపుల్ లీడర్ (విద్యార్థి, విద్యార్థిని) క్లబ్ జనరల్ సెక్రెటరీ, అసిస్టెంట్ జనరల్ సెక్రెటరీ ఆరోతరగతి నుంచి పదో తరగతి వరకు (గ్రీన్, రెడ్, ఎల్లో, బ్లూ) గ్రూపుల కెప్టెన్లను ఎన్నుకోగా వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు అంకితభావం, చిత్తశుద్ధితో పాటు నాయకత్వ ల‌క్ష‌ణాలు పెంపొందించుకునేందుకు కృషి చేయాలన్నారు. ప్రపంచానికి నైతికత, దూరదృష్టి కలిగిన నాయకత్వం అవసరమన్నారు. పాఠశాలలో విద్యార్థినీవిద్యార్థులకు హెడ్ బాయ్‌, హెడ్‌ గర్ల్‌ పదవుల కోసం ఎన్నికలు పెట్టి.. మరోవైపు చట్టసభలకు ప్రజాప్రతినిధులకు ఎన్నుకున్నట్టుగా ఎన్నికల పోలింగ్‌ విద్యార్థులకు అవగాహన కల్పించిన ఉపాధ్యాయులను అభినందించారు. ముఖ్యంగా, విద్యార్థి కౌన్సిల్‌లో ఎన్నుకోబడిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. నాయకత్వం అంటే కేవలం అధికారం కాదు, సేవ చేయడమన్నారు. పదవి బాధ్యతలు తీసుకున్న విద్యార్థులు సహ విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తూ వారి సమస్యలను తెలుసుకోవాలన్నారు. విద్యార్థులకు చక్కటి మార్గనిర్దేశం చేసి, వారిలోని నాయకత్వ లక్షణాలను ప్రోత్సహించడంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమైనదాని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు మంజుల రెడ్డి, కల్పన, ప్రిన్సిపల్ సజిత, వైస్ ప్రిన్సిపాల్ నవీన్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38683/