schedule Wednesday, September 09, 2026

చెరువులో గల్లంతై.. వ్యక్తి మృతి

calendar_today September 24, 2025
person dharshininews
చెరువులో గల్లంతై.. వ్యక్తి మృతి
చెరువులో గల్లంతై.. వ్యక్తి మృతి - గజ ఈతగాళ్లతో మృతదేహాన్ని వెలికీతీత - బషీరాబాద్‌ మండలంలో ఘటన బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : చెరువులో గల్లంతై ఓ వ్యక్తి మృతి చెందాడు. గత ఈతగాళ్లను పిలిపించి మృతదేహాన్ని వెలికితీశారు. ఈ సంఘటన బషీరాబాద్ మండలం మంతట్టి గ్రామంలో వెలుగులోకి వచ్చింది. బషీరాబాద్‌ ఎస్ఐ నూమన్ అలీ తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం సేడం తాలూకా, లింగంపల్లి గ్రామానికి చెందిన లింగంపల్లి శ్యాణప్ప(52) గత ఏండ్ల క్రితం బషీరాబాద్‌ మండలం మంతట్టి గ్రామానికి వలస వచ్చాడు. బార్య, పిల్లలతో కలిసి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే మంగళవారం గ్రామానిఇ చెందిన లింగంపల్లిలో ఓ వ్యక్తి అంత్యక్రియల కోసం వెళ్లి అదే రోజు సాయంత్రం గ్రామానికి చేరుకున్నాడు. సాయంత్రం మంతట్టి గ్రామ సమీపంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాల వద్ద పిన్‌ చెరువులోకి స్నానం చేసేందుకు వెళ్లాడు. kvcs అప్పటికే శ్యాణప్ప మద్యం మత్తులో ఉన్నాడు. చెరువులో మునిగిన శ్యాణప్ప గల్లంతై బటయకు రాలేదు. ఈ విషయం తెలుసుకుని భార్య, కుటుంభీకులు చెరువు వద్దకు వెళ్లి పరిశీలచింగా ఆచూకీ తెలియరాలేదు. బషీరాబద్‌ పోలీసులకు సమాచారం అందించారు. రాత్రి కావడంతో గాలింపు సాధ్యపడలేదు. బుధవారం ఉదయం పోలీసులు గజ ఈతగాళ్లను రప్పించారు. చెరవులో గజ ఈతగాళ్ల ద్వారా గాలించగా మధ్యాహ్నం వేళ శ్యాణప్ప మృతదేహంను బయటకు తీశారు. మద్యం మత్తులో శ్యాణప్ప చెరువులో మునిగి మృతి చెందినట్లు మృతుని భార్య లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ నూమన్ అలీ తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38777/