schedule Thursday, September 03, 2026

'మంచ్' నడక సందేశం..!

calendar_today October 12, 2025
person dharshininews
'మంచ్' నడక సందేశం..!
'మంచ్' నడక సందేశం..! - పురవీధుల్లో అట్టహాసంగ్ వాక్‌ థాన్ - పాల్గొన్న మార్వాడీ యువమంచ్ సభ్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి : నడకతోనే మనిషి ఆరోగ్యంగా ఉంటారని తాండూరు మార్వాడి యువమంచ్ మంచ్ సందేశాన్ని ఇచ్చింది. మార్వాడి యువమంచ్ జాతీయ కార్యక్రమంలో భాగంగా తాండూరు శాఖ ఆధ్వర్యంలో ఆదివారం వాక్ థాన్ కార్యక్రమాన్ని చేపట్టారు. తాండూరు మంచ్ వ్యవస్థాపకులు విజయ ప్రకాష్ సార్దా జెండా ఊపి నడక ర్యాలీని ప్రారంభించారు. పట్టణంలోని మార్వాడి బజార్ నుంచి వివిధ పుర వీధుల గుండా వాక్ థాన్ కొనసాగింది. ఈ ర్యాలిలో చిన్నారులు, పెద్దలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా మార్వాడి యువమంచ్ జాతీయ కార్యవర్గ సభ్యులు మన్మోహన్ సార్డా, పలువురు సభ్యులు మాట్లాడుతూ నడక వల్ల మనిషి ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయని తెలిపారు. ప్రతి రోజూ సెల్ ఫోన్ కు ఓ గంట చార్జింగ్ ఎలా పెడతారో.. అలాగే ఓ మనిషి గంట నడవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారని అన్నారు. kvcs అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండడంతో పాటు ప్రతిరోజు ఎంతో ఉత్సహాంగా గడుపుతారని అన్నారు. ప్రతి ఒక్కరు ఉదయం నడకను అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంచ్ అధ్యక్షులు అనిల్ సార్డా, కార్యదర్శి సచిన్ రాఠి, కోశాధికారి అరుణ్ సార్డా, జాతీయ కార్యదర్శి రోహిత్ అగ్రవాల్, మాజీ అధ్యక్షులు సూర్య ప్రకాష్ సోమాని, కార్యక్రమ చైర్మన్ లు దీనేష్ పర్తానీ, బ్రిజ్ మోహన్ బూబ్, రాజ్ గోపాల్ గగ్రాని, మంచ్ సభ్యులు నితిన్ సోమాని, ఆశిష్ సార్డా, రాకేష్ బూబ్, మధు సోని, ముఖేష్ సోమాని, కిషన్ రాఠి. రోహిత్ సోని, నిహార్ సోమాని, లక్ష్మీ నారాయణ్ బూబ్, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39088/