schedule Wednesday, September 09, 2026

సోమేశ్వర దేవాలయ భూమి స్వాదీనం

calendar_today November 1, 2025
person dharshininews
సోమేశ్వర దేవాలయ భూమి స్వాదీనం
సోమేశ్వర దేవాలయ భూమి స్వాదీనం - బోర్డులు పాతిన దేవాదాయశాఖ అధికారులు - భూముల వద్ద పాతిన బోర్డులు తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ పరిధిలోని సోమేశ్వర దేవాలయానికి చెందిన భూములను దేవాదాయ శాఖ అధికారులు స్వాదీనం చేసుకున్నారు. మున్సిపల్ పరిధి పాత తాండూరులోని సోమేశ్వర దేవాలయం దేవాదాయ శాఖ పరిధిలో కొనసాగుతోంది. ఈ దేవాలయంకు సంబంధించి సర్వేనెంబర్ 37లో 5ఎకరాల 37 గుంటల భూమి ఉంది. గత కొన్నినెలలుగా అన్యాక్రాంతంగా ఉన్న భూమిని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమీషనర్ ఆదేశాల మేరకు భూమిని స్వాదీనం చేసుకోవడం జరిగిందని దేవాదాయ శాఖ అధికారి శేఖర్ తెలిపారు. kvcs భూమిలో హెచ్చరిక బోర్డులు కూడా పాతడం జరిగిందని చెప్పారు. ఈ భూమిని ఎవరైనా ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే చట్టరిత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ సిబ్బంది ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39345/