schedule Wednesday, September 09, 2026

మహిళల అభివృద్ధికి ప్రాధాన్యం

calendar_today November 1, 2025
person dharshininews
మహిళల అభివృద్ధికి ప్రాధాన్యం
మహిళల అభివృద్ధికి ప్రాధాన్యం - నాటుకోళ్ల పెంపకంతో ఉపాది పొందాలి - ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి - ఇందిరా మహిళ శక్తి ద్వారా నాటు కోడి పిల్లల పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలు అన్నారు. శనివారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందిరా మహిళ శక్తి పథకంలో భాగంగా తాండూరు మండలానికి చెందిన మహిళ సంఘాల సభ్యులకు నాటు కోడి పిల్లల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పాల్గొని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి మహిళ సంఘాలకు నాడి కోడి పిల్లలను పంపిణీ చేశారు. అనంతరం బీర్ల ఐలయ్య మాట్లాడుతూ మహిళ సంఘాలను అభివృద్ధిలోకి తీసుకవచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. నాటు కోడి పిల్లల పెంపకంలో మహిళ సంఘాలు స్వయం ఉపాధి పొంది వృద్ధి చెందాలని ఆకాంక్షించారు. kvcs ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గానికి సంబంధించి 950 నాటు కోడి పిల్లలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా పెద్దేముల్ మండలానికి చెందిన 21 మంది లబ్దిదారులకు రూ.21 లక్షల 2వేల 436ల విలువైన కళ్యాణలక్ష్మీ, షాదీ ముభారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళ సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39349/