schedule Wednesday, September 09, 2026

ఒగ్గు సత్తెప్పకు భరోసా..!

calendar_today November 1, 2025
person dharshininews
ఒగ్గు సత్తెప్పకు భరోసా..!
ఒగ్గు సత్తెప్పకు భరోసా..! - పరామర్శించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య - ఎమ్మెల్యేతో కలిసి సాయం అందజేత - ప్రభుత్వం ద్వారా ఆదుకుంటామని మనోధైర్యం తాండూరు, దర్శిని ప్రతినిధి : పెద్దేముల్ మండలం కందనెల్లి గ్రామానికి చెందిన ఒగ్గు సత్తెప్పకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలు భరోసా అందించారు. గత సోమవారం సత్తెప్పకు చెందిన 50 గొర్రెలు కుక్కల దాడిలో గాయపడి మృత్యవాత పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో సత్తెప్పకు తీరని నష్టం జరిగింది. శనివారం తాండూరుకు వచ్చిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఈ విషయం తెలుసుకుని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి కందనెల్లి గ్రామానికి చేరుకుని ఒగ్గు సత్తెప్ప కుటుంబాన్ని పరామర్శించారు. సత్తెప్ప దంపతులకు మనోధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరుపున ఆదుకుంటామని తెలిపారు. kvcs వెంటనే రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రివర్యులు వాకిటి శ్రీహరితో ఫోన్ ద్వార జరిగిన సంఘటన పూర్తి వివరాలు తెలిపారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్‌తో కూడా మాట్లాడారు. ఈ సంఘటనకు సంబంధించిన నివేధికను అందిస్తామన్నారు. అదేవిధంగా తక్షణ సహాయంగా ప్రభుత్వ విప్ ఐలయ్య గారు రూ.10వేలు, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి రూ.25వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. అంతేకాకుండా త్వరలో కుర్వ సంఘం తరుపున మరో రూ.50,000 ఆర్థిక సహాయం అందించే విధంగా చూస్తామని ప్రభుత్వ విప్ ఐలయ్య గారు హామీ ఇచ్చారు. వారి వెంట మాజీ ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, సంఘం సభ్యులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39354/