schedule Wednesday, September 09, 2026

ప్రాణాలతో బయటపడిన ప్రత్యక్ష సాక్షి

calendar_today November 3, 2025
person dharshininews
ప్రాణాలతో బయటపడిన ప్రత్యక్ష సాక్షి
ప్రాణాలతో బయటపడిన ప్రత్యక్ష సాక్షి - టిప్పర్‌ ఢీకొ్ట్టిన బస్సు సీట్ల చివరి స్థానంలో తాండూరు యువకుడు - అక్కా చెల్లెళ్లు ఎలా చనిపోయారో చెప్పిన యువకుడు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : చేవేళ్ల మండలం మీర్జాగూడలో జరిగిన టిప్పర్ లారీ, ఆర్టీసీ బస్సు ప్రమాదంలో తాండూరు మండలానికి చెందిన యువకుడు, ప్రత్యక్ష సాక్షి ప్రాణాలతో బయటపడ్డాడు. రెప్పపాటులో జరిగిన దృశ్యాలను తెలిపారు. తాండూరు మండలం గౌతాపూర్ గ్రామానికి చెందిన బాలపోళ్ల వినయ్ కుమార్ హైదరాబాద్ లోని సన్ సిటీ ప్రాంతంలో ప్రైవేటు టీచర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం, ఆదివారం సెలవు దినాలు కావడంతో స్వగ్రామానికి వచ్చాడు. సోమవారం ఉదయం సోదరుడు బైకుపై తాండూరు బస్టాండు వద్ద విడిచాడు. వినయ్‌ కుమార్ హైదరాబాద్ వెళ్లేందుకు ఆర్టీసీ బస్సును ఎక్కి బయల్దేరాడు. చేవేళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఆర్టీసీ బస్సును టీప్పర్ లారీ ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో స్వల్పగాయాలతో బయటపడినట్లు తెలిపారు. kvcs ముగ్గురు అక్కా చెల్లెళ్ల వెనుకాలే.. ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్లు కూర్చున్న సీటు వెనుకాలే తాను కూర్చున్నట్లు వినయ్ కుమార్ తెలిపారు. టిప్పర్ బస్సును ఢీ కొట్టుకుంటూ రావడంతో టిప్పర్ దాడి తీవ్రత అక్కా చెల్లెళ్ల సీట్ల వరకు వచ్చిందని, వెంటనే టిప్పర్ లో ఉన్న కంకర మొత్తం తనపై పడిందని చెప్పుకొచ్చాడు. కంకర నుంచి బయటకు వచ్చేసి.. బస్సులో ఉన్న కండక్టర్‌ ను తానే లాగేసినట్లు తెలిపాడు. అప్పటికే అక్కా చెల్లెళ్లు, తన వెనుకాల ఉన్న ప్రయాణికుడు మృతి చెందినట్లు తెలిపాడు. ప్రమాదంలో తోటి ప్రయాణికులను కాపాడేందుకు స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రమాదం విషయం తెలుసుకున్న తన కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని తెలిపారు. వారి సూచనతో తాండూరుకు వచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స చేయించుకుంటున్నట్లు తెలిపారు. మరో యువకుడు సురక్షితం మరోవైపు తాండూరు మండలం వీరారెడ్డిపల్లికి చెందిన జగదీష్ అంతారం గ్రామంలో తన అమ్మమ్మ ప్రధమ వర్ధంతి కార్యక్రమానికి హైదరాబాద్‌ నుంచి వచ్చాడు. సోమవారం హైదరాబాద్‌ వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కాడు. చేవేళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో జగదీష్ కూడా సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. పట్నం మహేందర్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జగదష్‌ను అంతారం గ్రామానికి చెందిన ఎన్ఎస్‌యూఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అంకిత్ అనురాగ్ పరామర్శించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39389/