ఇందిరమ్మ ఇంటికి మరో రూ.లక్ష
November 15, 2025
dharshininews
ఇందిరమ్మ ఇంటికి మరో రూ.లక్ష
- వడ్డీ లేకుండా రుణం పొందే అవకాశం
- అర్హతలు, నిబంధనలు ఇలా
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి చేయూతను అందిస్తోంది. ఖాళీ స్థలం ఉండి సొంతింటిని నిర్మించుకునేందుకు రూ. 5లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తోంది. ప్రభుత్వం సాయం పెద్దదైనా కూడా ఇంటి నిర్మాణం కోసం ఇసుక, ఇనుము, ఇటుకల ధరలు పెరిగిపోవడంతో లబ్దిదారులు ఇళ్ల నిర్మాణానికి వెనుకడుగు వేస్తున్నారు. అయితే ప్రభుత్వ సాయంతో పాటు మరో రూ.1లక్ష వరకు లబ్దిదారుల పొందే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
అది ఎలాగంటే.. మహిళలు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నవారికి బ్యాంకు నుంచి రుణాలు అందిస్తున్నారు. ఇప్పటికే మహిళ సంఘాల్లోని పలువురు సభ్యులు రుణాలు పొందార. రుణాలు తీసుకున్న లబ్దిదారలు వాయిదాల పద్దతిలో చెల్లించవచ్చు. ఇల్లు మంజూరైనా ఆర్థిక స్థోమత లేక, ప్రభుత్వం ఇచ్చే డబ్బులు సరిపోవని ఇంకా నిర్మాణాలు ప్రారంభించని వారు చాలామంది ఉన్నారు. ఇలాంటి వారికి బ్యాంకు రుణం ఎంతో ఉపయోగపడుతోంది.
అర్హతలు, రుణాల మంజూరు ఇలా..
ఇందిరమ్మ ఇల్లు మంజూరైన మహిళ పొదుపు సంఘంలో సభ్యురాలిగా ఉండాలి. రుణం కావాలని మహిళా సంఘానికి దరఖాస్తు చేసుకుంటే సభ్యులంతా చర్చించి తీర్మానం చేస్తారు. సూక్ష్మరుణ ప్రణాళిక(ఎంసీపీ) తయారు చేసి దాని ప్రతిని సంఘం తీర్మానానికి జతపర్చి బ్యాంకులో సమర్పించాలి. బ్యాంకు అధికారులు పరిశీలించి సంబంధిత మహిళకు రుణం మంజూరు చేస్తారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/39626/