schedule Tuesday, September 08, 2026

విచారణకు పిలిచి.. లాఠీ దెబ్బలు..!

calendar_today November 17, 2025
person dharshininews
విచారణకు పిలిచి.. లాఠీ దెబ్బలు..!
విచారణకు పిలిచి.. లాఠీ దెబ్బలు..! - నేరం ఒప్పుకోమని కొట్టారన్న బాధితుడు - దాడితో అస్వస్థతకు గురైన వ్యక్తి - వివాదాస్పదమైన పోలీసుల తీరు - పెద్దేముల్ పోలీస్టేషన్‌ పరిధిలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : విచారణకు పిలిచి పోలీసులు వ్యక్తిపై దాడి చేయడం తాండూరు నియోజకవర్గంలో వివాదాస్పందగా మారింది. పోలీసుల లాఠీ దెబ్బలతో అస్వస్థతకు గురైన బాధితుడు ఆసుపత్రి పాలు అయ్యాడు. ఈ సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామానికి చెందిన గౌస్ అనే వ్యక్తి కౌలుకు తీసుకున్న పొలంలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ కేసు విషయమై విచారణకు రావాలని పెద్దేముల్ పోలీసులు మంబాపూర్‌కు చెందిన ఫిరోజ్ అనే వ్యక్తిని పోలీస్టేషన్‌కు పిలిచారు. ఎస్ఐ వేణు, పోలీసు సిబ్బంది తనపై లాఠీ దెబ్బలు వేశారని బాధితుడు ఫిరోజ్ తెలిపాడు. సుమారు 40 నిమిషాల పాటు కాళ్లపై, చేతులపై కొట్టారని ఆరోపించాడు. గౌస్ హత్యా నేరాన్ని ఒప్పుకోవాలని కొట్టారని తెలిపారు. కొట్టిన విషయాన్ని ఎవ్వరికి ఎవ్వరికి చెప్పొద్దని ఎస్ఐ వేణు చెప్పాడని తెలిపాడు. పోలీసుల దెబ్బలకు అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు తనను తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాడని వివరించారు. ఈ సంఘటన వివాదాస్పదంగా మారింది. ఈ సంఘటనపై పోలీసులు స్పందించాల్సి ఉంది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39667/