schedule Tuesday, September 08, 2026

టీఆర్ఎస్ఎంఏ జిల్లా కార్యవర్గం ఎన్నిక

calendar_today November 17, 2025
person dharshininews
టీఆర్ఎస్ఎంఏ జిల్లా కార్యవర్గం ఎన్నిక
టీఆర్ఎస్ఎంఏ జిల్లా కార్యవర్గం ఎన్నిక - జిల్లా ప్రధాన కార్యదర్శిగా అభిలాష్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రికగ్నైస్డ్ స్కూల్స్ మేనేజ్ మెంట్ అసోసియేషన్(టీఆర్ఎస్ఎంఏ) వికారాబాద్ జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఇటీవలే కార్యవర్గ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. ఇందులో తాండూరుకు చెందిన అభిలాష్ రెడ్డికి చోటు దక్కింది. జిల్లాలోని 126 స్కూళ్ల ఆధ్వర్యంలో టీఆర్ఎంఏ జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. 2025-27 సంవత్సరానికి గాను కార్యవర్గం ఎన్నిక జరగగా జిల్లా అధ్యక్షులుగా ఎన్. వెంకట్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా డి. వీరేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా బి. అభిలాష్ రెడ్డి, కోశాధికారిగా వి.ప్రకాష్ చారి, సంయుక్త కార్యదర్శిగా ఎ. కిరణ్ కుమార్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హ్యుమన్ వాల్యుస్ ట్రాన్స్‌పార్మర్ ఫౌండర్, ఎగ్జిక్యూటీవ్ చైర్మన్ డా. నల్ల బోయిన సుదర్శన్ ఆచార్య, టీఆర్ఎస్ఎంఏ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.ఎన్. రెడ్డిల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి అభిలాష్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ఎంఏ ఆధ్వర్యంలో అన్ని స్కూళ్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. మరోవైపు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన అభిలాష్ రెడ్డికి తాండూరుకు చెందిన పలు స్కూళ్ల మేనేజ్ మెంట్ సభ్యులు అభినందనలు తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39681/