schedule Tuesday, September 08, 2026

మహిళ కూలికి పాము కాటు..!

calendar_today November 20, 2025
person dharshininews
మహిళ కూలికి పాము కాటు..!
మహిళ కూలికి పాము కాటు..! - జిల్లా ఆసుపత్రికి తరలింపు, పరిస్థితి విషమం - మెరుగైన వైద్యం కోసం ప్రైవేటుకు తరలింపు తాండూరు, దర్శిని ప్రతినిధి : పొలంలో పనిచేసేందుకు వెళ్లిన ఓ మహిళ పాము కాటుకు గురైంది. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే పరిస్థితి విషమించింది. మెరుగైన వైద్యం కోసం కుటుంభీకులు ప్రైవేటు ఆసుపత్రికి తలిరంచారు. ఈ సంఘటన గురువారం పెద్దేముల్ మండలంలో జరిగింది. మండలంలోని గాజీపూర్ గ్రామానికి చెందిన సకినా భేగం గురువారం గ్రామ సమీపంలోని చెర్ల నర్సింలుకు చెందిన పత్తి పొలంలో కూలీ పనికి వెళ్లింది. పని మద్యలో నీరు తాగేందుకు గట్టు వద్దకు వెళ్లింది. అక్కడే మాటు వేసిన పాము ఆమె నీరు తాగిన తరువాత చేతికి కాటు వేసింది. విషయం తోటి కూలీలకు తెలపడంతో వారు ఆమెను చికిత్స నిమిత్తం 108లో తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా మహిళను కాటు వేసింది నాగుపాముగా తెలిపారు. జిల్లా ఆసుపత్రిలో పరిశీలించిన వైద్యులు సకినా భేగం పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్ కు రిఫర్ చేశారు. కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం వికారాబాద్ లోని ఓ ప్రవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39758/